ప్రగతిలో ప్రజలూ భాగస్వాములు కావాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-06-02T09:25:13+05:30 IST

జిల్లా వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్య వారోత్స వాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భ ంగా గ్రామాల్లో

ప్రగతిలో ప్రజలూ భాగస్వాములు కావాలి : కలెక్టర్‌

సూర్యాపేట, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్య వారోత్స వాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భ ంగా గ్రామాల్లో మురుగు కాల్వల పూడికతీత, చెత్తాచెదారం తొలగింపు, డంపింగ్‌యార్డులకు తొలగించడం చేపట్టారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణతో కలిసి పట్టణ ప్రగతి ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల పనులను సోమవారం పరిశీలించి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, కౌన్సిలర్లు అన్నపర్తి రాజేష్‌, కుంభం రేణుకరాజేందర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా అర్వపల్లి మండల కేంద్రంలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పరిశీలించారు.


మురుగుకాల్వల విస్తరణపై సర్పంచ్‌ను సర్పంచ్‌ సునీతారామలింగయ్యను అడిగి తెలుసుకున్నారు. హైవే విస్తరణపై డీఈ ప్రవీణ్‌రెడ్డితో మాట్లాడారు. మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో సర్పంచ్‌లు జ్యోతి, శేఖర్‌, సునీతా పాల్గొన్నారు.  తిరుమలగిరి మండలంలో జరిగిన కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి శిరీష, ఎంపీడీవో ఉమే్‌షచారి, సర్పంచ్‌ రవి, తుంగతుర్తిలో ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్‌, ఎంపీడీవో లక్ష్మీ, ఎంపీవో భీంసింగ్‌, చిలుకూరులో ప్రత్యేకాధికారి, మత్స్య శాఖా జిల్లా అఽధికారి సౌజన్య, సర్పంచ్‌ చంద్రకళనాగయ్య, కోదాడ మండలంలో ప్రత్యేక అధికారి రవి, జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి, సర్పంచ్‌ శెట్టి సురేష్‌, సర్పంచ్‌ రాణి, గరిడేపల్లిలో డీఎల్‌పీవో శ్రీరాములు, సర్పంచ్‌ త్రిపురం సీతారాంరెడ్డి, హుజూర్‌నగర్‌లో కమిషనర్‌ నాగిరెడ్డి, కోతి సంపత్‌రెడ్డి, ఏఈ ప్రవీణ్‌, అదేవిధంగా మండలంలో సర్పంచ్‌లు అన్నెం శిరీషకొండారెడ్డి, గుజ్జుల సుజాతఅంజిరెడ్డి, సైదేశ్వరరావు, రమ్యనాగరాజు, మఠంపల్లి మండలంలో ఎంపీపీ ముడావత్‌ పార్వతీకొండానాయక్‌, సర్పంచ్‌లు కృష్ణవేణినరేష్‌, నాగిరెడ్డి, గరిడేపల్లి మండల పరిధిలో సర్పంచ్‌లు గాలి రామకృష్ణ, కుసుమ వెంకటమ్మశ్రీనివాసరెడ్డి, వెన్న రవీందర్‌రెడ్డి, మేళ్లచెర్వు మండలంలో ఎంపీడీవో ఎండీ ఇసాక్‌హుస్సేన్‌, ఎంపీవో వీరయ్య, నేరేడుచర్లలో చైర్మన్‌ జయబాబు, డీఎల్పీవో శ్రీరాములు, దొండపాటి అప్పిరెడ్డి, పాలకవీడులో సజ్జపురం సర్పంచ్‌ గుండెబోయిన నర్సింహ, ఆయా గ్రామాల కార్యదర్శులు, ఆత్మకూర్‌(ఎస్‌)మండలంలో ప్రత్యేకాధికారులతో పాటుగా సర్పంచ్‌లు, చివ్వెంలలో ఎంపీడీవో జమలారెడ్డి, సర్పంచ్‌లు, సూర్యాపేట మండలంలో ఎంపీపీ రవీందరెడ్డి, జడ్పీటీసీ జీడి బిక్షం, మోతెలో మండలంలో జడ్పీటీసీ పి.పుల్లారావు, ఎంపీడీవో శంకర్‌రెడ్డి, తుంగతుర్తిలో ఎంపీపీ గుండగాని కవితరాములుగౌడ్‌, ఎంపీడీవో లక్ష్మీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 


పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. మురుగుకాల్వలు, చెత్తాచెదారం లేకుండా తొలగించాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజనిరాజశేఖర్‌, వైస్‌చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, కమిషనర్‌ ఉమే్‌షచారి పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-02T09:25:13+05:30 IST