ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి

ABN , First Publish Date - 2021-04-17T05:33:47+05:30 IST

ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనాను కట్టడి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ అన్నారు.

ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి
జేఎన్‌టీయూ వద్ద వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

 కొండగట్టు జేఎన్‌టీయూ ఐసోలేషన్‌ సెంటర్‌ పరిశీలించిన ఎమ్మెల్యే రవిశంకర్‌

కొడిమ్యాల, ఏప్రిల్‌ 16: ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనాను కట్టడి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని నాచుపెల్లి జేఎన్‌టీయూ ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా బాదితులకు చికిత్సను అందించేందుకు ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే జేఎన్‌టీయూలో  100 పడకలు సిద్దంగా ఉన్నాయన్నారు. 45 సవత్సరాలు పెబడిన ప్రతి ఒక్కరూ  వాక్సిన్‌ చేయించుకోవాలన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించా లన్నారు. శానిటైజర్లను వాడాలన్నారు. గ్రామాలలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకోవటం హర్షనీయమన్నారు. వైద్యశాఖ చెప్పినట్లుగా వైరస్‌ గాలితో సోకుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారావు. కొడిమ్యాల సింగిల్‌ విండో చైర్మన్‌ రాజనర్సింగరావు, ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, ఎంపీడీవో రమేష్‌, తహసీ ల్దార్‌ స్వర్ణ, డిప్యూటీ తహసీల్దార్‌ సమ్మయ్య, రెవెన్యూ సీనియర్‌ సహాయకుడు భూమయ్య, ఎంపీవో గంగాధర్‌, పలు గ్రామాల నాయకులు, సత్యం, నరేందర్‌రెడ్డ్డి, శరత్‌ నరేష్‌, అంజన్‌కుమార్‌, జేఎన్‌టీయూ ప్రత్యేక వైద్య అధికారులు, సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-04-17T05:33:47+05:30 IST