Abn logo
May 14 2021 @ 00:22AM

లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి : మంత్రి

సమీక్ష సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడుతున్న మంత్రి

ఆదిలాబాద్‌టౌన్‌, మే13: జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరుగుతుంద ని, కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, లాక్‌డౌన్‌కు ప్రజలు పూ ర్తిగా సహకరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కొవిడ్‌ నియంత్రణ, వైద్య సేవలు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 12 నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ ఉంటుందని తెలిపారు. మొదటి రోజు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రజలు సహకరించారని తెలిపారు. జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యలు, వైద్యసేవలు అందించేందుకు రోగులకు అవసరమైన మందులు, ఇతర వైద్య సేవల పర్యవేక్షించడానికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో సమస్యలను రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌కు నివేదించి అవసరమై న సహకారం తీసుకుంటామని తెలిపారు. జిల్లా లో కొవిడ్‌ బాధితులకు అవసరమైన కిట్లను పంపిణీ చేస్తామని, పాజిటివ్‌ వచ్చిన వారు హోంఐసోలేషన్‌లో డాక్టర్లు సూచించిన విధంగా మాత్రలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఆక్సిజన్‌  కొరత లేకుండా కలెక్టర్‌ నిరంతరంగా పర్యవేక్షి స్తున్నారని తెలిపారు. కొవిడ్‌ బాధితులకు తక్షణ రవాణా సౌకర్యం అంబులెన్స్‌, ఇతర అవసరాల ను రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌కు నివేదిస్తామని తెలిపా రు. జిల్లాలో ఇప్పటివరకు ఇంటింటి సర్వే ద్వా రా మొదటి దశలో లక్షా 85వేల 851 ఇళ్లను 783 టీంల ద్వారా సర్వే చేశారని తెలిపారు. 5432 మందికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని గు ర్తించినట్లు చెప్పారు. రెండోవిడతలో 39వేల 602 గృహాలు సర్వే చేయగా, 529 మందికి లక్ష ణాలు ఉన్నట్లు గుర్తించి కిట్‌లను అందించామని తెలిపారు. జిల్లా వ్యా ప్తంగా 550 ప్రభుత్వం, 673 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చే వ్యక్తులను క్షుణ్ణంగా పర్యవేక్షించి వైద్యసేవలకు అనుమతిస్తున్నామని తెలిపారు. జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌జనార్దన్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలు కొవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని, వైరస్‌ సోకిన వారికి సౌకర్యాలు కల్పించాలని కోరారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ రి మ్స్‌లో ప్రస్తుతం 400 వరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయని వీటిని 600 వరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ కరోనా రోగులకు భరోసా కల్పిస్తూ వైద్యసేవలు అందించాలని సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయా లని కోరారు. ఎస్పీ రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో 400 మంది పోలీ సులతో 37 పాయింట్లలో లాక్‌డౌన్‌ను అమలు పరుస్తున్నామని తెలిపారు.  నిబంధనలు ఉల్లఘించిన, మాస్కు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీసీసీబీ చైర్మ న్‌ నాందేవ్‌, ఆర్డీవో రాజేశ్వర్‌, డీఎంహెచ్‌వో రాథోడ్‌నరేందర్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ బలిరాం, ఇతర జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టోల్‌ఫ్రీని సద్వినియోగం చేసుకోవాలి
కొవిడ్‌ సంబంధిత సమస్యలు, వైద్యసేవల కోసం, సలహాలు, సూచనల కు కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీని సద్విని యోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్ట రేట్‌ సమావేశ మందిరంలో టోల్‌ఫ్రీ గోడ ప్రతిని మంత్రి ఆవిష్కరించారు. అత్యవసర వైద్య సేవలకు, సలహాలకు,కోవిడ్‌ క్వారంటైన్‌ కేంద్రాలకు సం బంధించిన వివరాలను టోల్‌ఫ్రీ నెంబర్‌ 18004251939కు సంప్రదించవ చ్చన్నారు. అనంతరం కలెక్టరేట్‌ చౌక్‌లో మంత్రి లాక్‌డౌన్‌ను పరిశీలించా రు. స్థానిక శాసనసభ్యులు జోగురామన్న, రాథోడ్‌బాపురావులతో పాటు ఎస్పీ రాజేశ్‌చంద్రలతో లాక్‌డౌన్‌పై ఆరా తీశారు. ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Advertisement