హైదరాబాద్: ప్రధాని మోదీ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైందని ఎద్దేశాచేశారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా ఔట్ డేట్ అయ్యాడని, ప్రజలకు చేసింది ఏం లేఖనే ముఖం చాటేస్తున్నాడని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సాగర్ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జోస్యం చెప్పారు. నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. జానారెడ్డి హుందాగా పోటీ నుంచి తప్పుకుంటే గౌరవం దక్కేదని, కానీ ఇప్పుడు జానారెడ్డికి ఉన్న పరువుపోతుందని తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.