వైసీపీ పాలనలో ప్రజల జీవనం అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-10-03T06:08:43+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్ర ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపాలని వై.పాలెం టీడీపీ ఇన్‌ చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

వైసీపీ పాలనలో ప్రజల జీవనం అస్తవ్యస్తం
ఎర్రగొండపాలెంలో మహాత్మునికి టీడీపీ నేతల నివాళి

టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు

త్రిపురాంతకం, అక్టోబరు 2: వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్ర ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపాలని వై.పాలెం టీడీపీ ఇన్‌ చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని సోమేపల్లి, గాంధీనగర్‌, శ్రీనివాసనగర్‌ గ్రామాల్లో బాదుడేబాదుడు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించినవాళ్లను వేదించడం, కేసులు పెట్టడం మాత్రమే ఈ ప్రభుత్వానికి తెలుసని అభివృద్ధి అంటే తెలియదని విమర్శించారు. అలివికాని ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారని, పేద ప్రజలతోపాటు రైతులు, కార్మికులు, ఉద్యోగులు అన్ని వర్గాలవారూ ఇబ్బంది పడుతున్నారన్నారు. కూల్చివేతలతో మొదలైన వైసీపీ పాలన త్వరలోనే కూలిపోతుందని అన్నారు. అంతకుముందు గ్రామాల్లో ఇంటిం టికీ తిరిగి టీడీపీ ప్రభుత్వలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. కార్యక్రమాలల్లో  టీడీపీ మండల అధ్యక్షుడు ఎం.వలరాజు, నాయకులు డి.చలమయ్య, ఊట్ల వెంకటేశ్వర్లు, ఎం.అల్లూరిరెడ్డి, వి.ఆంజనే యులు, నాయకులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఎర్రగొండపాలెం ప్రధాన కూడలిలో టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర టీడీపీ నాయకులు ఘనంగా నివాళులు తెలిపారు. మహాత్మాగాంధీ విగ్రహానికి 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఉంచి టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జీ గూడూరి ఎరిక్షన్‌బాబు, జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర, మాజీ ఎఎంసీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, టీడీపీ ముఖ్యనాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు,  షేక్‌ జిలానీ, చిట్యాల వెంగళరెడ్డి,  గోళ్ళ  సుబ్బారావు,  తోట మహేష్‌, వేగినాటి శ్రీను, కంచర్ల సత్యనారాయణగౌడ్‌, నాగరాజు వెంకటేశ్వర్లు, శనగా నారాయణరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T06:08:43+05:30 IST