అమెరికాకు పెరుగుతున్న ‘వ్యాక్సినేషన్ టూర్స్’

ABN , First Publish Date - 2021-06-22T05:01:17+05:30 IST

ప్రపంచంలో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో ఉంది. అమెరికా స్వతంత్ర దినోత్సవం జూలై 4 నాటికి దేశంలోని పెద్ద వాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ అందివ్వాలని ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

అమెరికాకు పెరుగుతున్న ‘వ్యాక్సినేషన్ టూర్స్’

వాషింగ్టన్: ప్రపంచంలో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో ఉంది. అమెరికా స్వతంత్ర దినోత్సవం జూలై 4 నాటికి దేశంలోని పెద్ద వాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ అందివ్వాలని ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా మందకొడిగా సాగుతోంది. ఆయా దేశాల్లో వ్యాక్సిన్లు సరిగా అందుబాటులో కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా, థాయ్‌‌ల్యాండ్ వంటి దేశాలకు చెందిన సంపన్నులు వ్యాక్సినేషన్ కోసమే అమెరికా ప్రయాణమవుతున్నారు. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు కూడా ‘వ్యాక్సినేషన్ టూర్స్’ అంటూ ప్యాకేజీలు ఇస్తుండటం గమనార్హం.

Updated Date - 2021-06-22T05:01:17+05:30 IST