కేసీఆర్ ముఖాన్ని చూడడానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడడం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అయినప్పటికీ రూ.33 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టి ముఖాన్ని చూపించేందుకు కేసీఆర్ తాపత్రయపడ్డారని విమర్శించారు. ఫొటోలు, ఫ్లెక్సీలు కనిపించకపోయినా ప్రజల గుండెల్లో మోదీ స్థానం సంపాదించుకున్నారన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రాబోతున్న 20వ రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. టీఆర్‌ఎస్ లాంటి బుడ్డ పార్టీ.. బీజేపీకి పోటీ కాదని ఈటల అన్నారు.