Abn logo
Sep 20 2021 @ 23:18PM

బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మాటలు ప్రజలు నమ్మొద్దు

మురళీపంతులును సన్మానిస్తున్న ఎమ్మెల్యే

నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 

పెద్దశంకరంపేట, సెప్టెంబరు 20 : బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలోని బాయ్‌కాడి పద్మ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ మండల నూతన కార్యవర్గ ఎన్నికలో పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, జడ్పీటీసీ విజయరామరాజు, పేట సర్పంచ్‌ సత్యనారాయణ, వైస్‌ ఎంపీపీ లక్ష్మీరమేష్‌, నాయకులు వేణుగోపాల్‌గౌడ్‌, సుభా్‌షగౌడ్‌, సురే్‌షగౌడ్‌, మాణిక్‌రెడ్డి, ఆర్‌ఎన్‌ సంతూ పాల్గొన్నారు.