Abn logo
May 13 2021 @ 11:26AM

హైదరాబాద్‌లో భారీగా రోడ్లపైకి వచ్చిన జనం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జనం భారీగా రోడ్లపైకి వచ్చేశారు. ఉదయం నుంచే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రేపు రంజాన్ కావడంతో పాతబస్తీలో రద్దీ పెరిగిపోయింది. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కోసం పెద్దసంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చారు. రాంనగర్ చేపల మార్కెట్‌లో రద్దీ ది.బాగా కనిపించింది. మార్కెట్లలో భౌతికదూరం కొరవడటమే కాకుండా మాస్కులు పెట్టుకున్నవారు సైతం పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ్టి నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్ నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. 


Advertisement