బియ్యం కోసం రేషన్ షాపుల ముందు ప్రజల పడిగాపులు

ABN , First Publish Date - 2020-04-05T00:33:05+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా రేషన్ షాపుల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. వస్తువులు తీసుకున్న వారు అవస్థలు పడుతూ తీసుకుంటుండగా, ఇక దొరకని వారు

బియ్యం కోసం రేషన్ షాపుల ముందు ప్రజల పడిగాపులు

సిద్దిపేట: లాక్‌డౌన్ కారణంగా రేషన్ షాపుల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. వస్తువులు తీసుకున్న వారు అవస్థలు పడుతూ తీసుకుంటుండగా, ఇక దొరకని వారు నిరాశతో వెనుదిరిగి పోతున్నారు. ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యాన్ని రేషన్ ద్వారా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే శుక్రవారం సర్వర్ డౌన్ ఉండటంతో ఇబ్బంది కలిగినా... శనివారం మాత్రం కొంత బాగుపడింది. దీంతో ఉదయం నుంచే రేషన్ షాపుల వద్ద ఉదయం నుంచి బారులు తీరారు.


ఇక, బయోమెట్రిక్ విషయంలో లబ్ధిదారులు థంబ్ వేయకుండా, ఒక్కో షాపుకు ఒక వీఆర్వోను కేటాయించారు. వీఆర్వోనే థంబ్ వేస్తున్నారు. నెలాఖరు వరకూ బియ్యాన్ని సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా, ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తగా రేషన్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. రేషన్ డీలర్లు కూడా ప్రజలు సామాజిక దూరం పాటించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. 


Updated Date - 2020-04-05T00:33:05+05:30 IST