అమరావతి: సీఎం జగన్ పాలనలో ప్రజలు అనేక బాధలు పడుతున్నారని టీడీపీ నేత లోకేష్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్ రేట్లు పెంచారని విమర్శించారు. జగన్ తప్పుడు నిర్ణయాల వల్లే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని తప్పుబట్టారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. జగన్ రకరకాల పన్నులు వేస్తూ ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. ఎన్నికల హామీలను జగన్ తుంగలో తొక్కారని లోకేష్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి