జ్వరాలతో జనం విలవిల!

ABN , First Publish Date - 2022-08-09T05:37:29+05:30 IST

వైరల్‌ జ్వరాలతో రోజురోజుకు జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నమని చెబుతున్నప్ప టికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం లేదా క్షేత్రస్థాయి అధి కారుల అలస త్వంతోనో దోమకాటు, విషజ్వరాలతో జి ల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

జ్వరాలతో జనం విలవిల!
జిల్లా కేంద్ర ఆసుపత్రి రోగులతో నిండిపోయిందిలా..

జిల్లాలో వ్యాపిస్తున్న విషజ్వరాలు 

భయపెడుతున్న మలేరియా,టైఫాయిడ్‌,డయేరియా

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న జనం

జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు తగ్గట్టుగా లేని బెడ్‌లు

ఎంసీహెచ్‌ పూర్తయితేనే ప్రజలకు తప్పనున్న ఇక్కట్లు

బాన్సువాడ ఎంసీహెచ్‌ ఆసుపత్రికి జ్వరాలతో క్యూకడుతున్న చిన్నారులు

ఆసుపత్రిలో సరిపోని బెడ్‌లు...ఒకే బెడ్‌పై ఇద్దరికి చికిత్స

కామారెడ్డి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): వైరల్‌ జ్వరాలతో రోజురోజుకు జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నమని చెబుతున్నప్ప టికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం లేదా క్షేత్రస్థాయి అధి కారుల అలస త్వంతోనో దోమకాటు, విషజ్వరాలతో జి ల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.వర్షాలు పడు తున్నాయన్న సంబరం కంటే జ్వరాలు సోకుతున్నాయనే ఆందోళనే ప్రజల్లో ఎక్కు వగా కనబడుతుంది. ఇప్పటికే జిల్లాలో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతూ వస్తున్నాయి. జలుబు, దగ్గు, తీవ్ర జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల వద్ద  జనం క్యూకడుతున్నారు. ఇ ప్పటికే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి చాలాచోట్ల నీటి నిల్వలు, దోమల ఆవాసకేంద్రాలు లేకుండా చేసిన పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మలేరియా, డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్నారని సమాచారం. ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడుతూ ప్రైవేట్‌ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మరికొందరు తీవ్ర జ్వరం, కప్పంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడడంతో ఆయా ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్‌లుగా చేరి రోజుల తరబడి చికిత్సలు పొందుతున్నారు. బాన్సువాడ ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేక ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు..

ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవ డం, ఖాళీ స్థలాల యాజమానులు తమ స్థలాల్లో పేరుకపోయిన చెత్తను, పిచ్చిమొక్కలు, నీటి నిల్వలపై దృష్టిసారించకపోవడంతో జిల్లాలో దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నా యి. వర్షాలకు పలు చోట్ల రహదారులు కోతకు గురై గుంతలు ఏర్పడి నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెంది పగలు రాత్రి అనే తేడా లేకుండా కుడుతూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ జ్వరాలన్నింటిలోనూ ఎక్కువగా మలేరియా కేసులు ఉండడం అందులోనూ చిన్నారులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడడంతో తల్లిదండ్రుల్ల్లో భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక వైరల్‌ జ్వరాలుసైతం చిన్న,పెద్ద అతి తేడా లేకుండా సోకుతుండడంతో ఇంట్లో ఉన్న నలుగురైదుగురు ఆసుపత్రులలో చేరి చికిత్సలు తీసుకుంటున్నారు.

పెరుగుతున్న డయేరియా కేసులు..

ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిదంటే కొత్త నీటితో పాటు వ్యాధులు వస్తాయి. అందులో ప్రధానమైనది డయేరి యా(అతిసారం). తాగేనీరు ఇతర జలవనరులు పరి శుభ్రంగా లేకపోవడం కలుషిత ఆహారం తీసుకోవడం వంటి పలు కారణాలతో డయేరియా వ్యాపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ వ్యాధి వల్ల జిల్లాలోని పట్టణ,గ్రామాన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసిన వాంతులు, విరేచనాలతో మంచాన పడుతున్నారని తెలుస్తోంది. ఏటా వర్షాకాలంలో పారిశు ధ్య లోపంతో అతిసారం ప్రబలుతోంది. నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో 5-10 మంది వరకు డయేరియా కేసులు నమోదు అవుతున్నాయి. వర్షాలతోనే కాకుండా ఈ మధ్యకాలంలో అభివృద్ధి పనుల్లో బాగంగా జిల్లా కేం ద్రంతో పాటు, గ్రామాల్లో మిషన్‌ భగీరథ పథకం పనుల కోసం ఎక్కడిక్కక్కడ గుంతలు తవ్వేయడంతో కొన్ని చోట్ల తాగునీటి పైపులు ధ్వంసమయ్యాయి. దీంతో పైపులెన్లుల్లో మురుగు నీరు కలిసి నీరు కలుషితమవు తున్నది. గ్రామాలు, పట్టణ ప్రాంతాలల్లో పారిశుధ్య సిబ్బంది క్లోరిన్‌ కలపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా కోన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో చెరు వులు, బావులు, బోర్లవద్ద ప్రజలు సహజంగా బట్టలు ఉతుకుతుంటారు.  ఈ సీజన్‌లో ఈగలు, దోమల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. దీంతో అతిసార వంటి వ్యాధులు అఽధికంగా సోకుతుంటాయి. వాంతులు, విరోచనాలు, కడుపునోప్పి, మూత్రవిసర్జన తగ్గిపోవడం లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. 

రోగులతో ఆసుపత్రులు కిటకిట..

జిల్లాలో విష జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు ప్రజలు పరుగులు పెడుతుండడంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ వి షజ్వరాలు అత్యధికంగా వెనుకబడిన ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, తండాలు, మురికి వాడల్లో సో కుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలలో ఎక్కు వగా పేద మధ్యతరగతి ప్రజలే ఉండడంతో ఆర్థిక స్థోమత లేక వైద్యం కోసం స్థానికంగా ఉండే ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్ర ఆసు పత్రులకు తరులుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సైతం రోగుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆయా ఆసుపత్రుల వైద్యులు పేర్కొంటున్నారు. కాగా కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి రోగులకు తగ్గట్టుగా సరిపోవడం లేదు. బెడ్లు అం తంతమాత్రంగానే ఉండడంతో రోగుల బంధువులు వైద్యులు, సి బ్బందితో గొడవకు దిగుతున్నారు. ఆసుపత్రిలో గర్భిణుల తాకిడి సై తం పెరగడంతో వారిని మిగిలిన విభాగాల్లో చేర్చడంతోనే ఈ స మస్య తలెత్తుతుందనే వాదనలు వి నిపిస్తున్నాయి. ఎంసీహెచ్‌ పనులు నత్తనడకన సాగడం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పనుల వేగరంపై దృష్టి సారించకపోవడంతోనే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంసీహెచ్‌  భవనం త్వరగా పూర్తయితే తప్ప పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన చికిత్సలు అందే పరిస్థితులు కనిపించడం లేదు.

Updated Date - 2022-08-09T05:37:29+05:30 IST