మూడో కన్నుతో పుట్టిన దూడ.. చూడటానికి ఎగబడుతున్న జనం.. ఇంతకీ ఎక్కడో తెలుసా..

ABN , First Publish Date - 2022-01-18T00:34:18+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లా గండాయ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఆవు ఈ దూడకు జన్మనిచ్చింది. దూడకు మూడు కళ్లు, నాలుగు ముక్కు రంధ్రాలు ఉన్నాయి. దీనికి తోడు...

మూడో కన్నుతో పుట్టిన దూడ.. చూడటానికి ఎగబడుతున్న జనం.. ఇంతకీ ఎక్కడో తెలుసా..

కుక్క కడుపున ఏనుగు పిల్ల, ఏనుగు కడుపున పంది పిల్ల.. ఇలా వింత వింత జననాలకు సంబంధించిన వార్తలు వింటూ వుంటాం. అలాంటి జంతువులను చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇలాంటి వింత జంతువుల్లో బతికేవి చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వింత జననం ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. ఓ దూడ పిల్ల మూడు కన్నులతో జన్మించింది. ఈ వార్త  ఆనోటా, ఈనోటా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఈ వింత దూడను చూడటానికి జనం ఎగబడుతున్నారు.


ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లా గండాయ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఆవు ఈ దూడకు జన్మనిచ్చింది. దూడకు మూడు కళ్లు, నాలుగు ముక్కు రంధ్రాలు ఉన్నాయి. దీనికి తోడు దాని తోక, నాలుక కూడా మిగతా దూడల్లా కాకుండా విచిత్రంగా ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన ఈ వింత దూడ పుట్టడంతో పూజలు చేసేందుకు మహిళలు క్యూ కడుతున్నారు. దూడను చూసిన వారంతా భగవంతుడి స్వరూపం అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆవు కడుపులోని పిండం వృద్ధి చెందకపోవడం వల్ల ఇలా జరుగుతుందని, ప్రస్తుతం దూడ ఆరోగ్యంగా ఉందని పశు వైద్యులు చెబుతున్నారు.

పాముతోనే నీరు తాగించాడు.. ఇతను మామూలు వ్యక్తి కాదు.. చూస్తే అవాక్కవుతారు..

Updated Date - 2022-01-18T00:34:18+05:30 IST