ప్రభుత్వంపై ప్రజాగ్రహం

ABN , First Publish Date - 2022-05-17T04:45:08+05:30 IST

రకరకాలుగా దోచుకుంటున్న ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తు తోందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

ప్రభుత్వంపై ప్రజాగ్రహం
కరపత్రాలు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

 బాదుడే బాదుడులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి

 కోవూరు, మే 16 : రకరకాలుగా దోచుకుంటున్న ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తు తోందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడులోని తూర్పు అరుంధతీయవాడలో సోమవారం టీడీపీ నాయకులు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. చెత్తమీద కూడా పన్ను వసూలు చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ చార్జీలు పెరగడంతో పేదలు ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే భయపడుతున్నారన్నారు. విద్యుత్‌ కోతలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. నియోజకవర్గం వైసీపీ నేతల అక్రమాలకు, మట్టి, ఇసుక, ధాన్యం మాఫియాలకు అడ్డేలేకుండా పోయిందన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి పాలనసాగి స్తున్నా రన్నారు. ఆ అక్రమాలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేస్తున్నా రని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మందా రవికుమార్‌,  ఇంతా మల్లారెడ్డి, ముసలి సుధాకర్‌, బాలరవి, చెంబేటి పెంచలయ్య,  సూరిశెట్టి శ్రీనివాసులు, నాటకాని వెంకట్‌, యద్దలపూడి నాగరాజు, కొల్లాసుధాకర్‌రెడ్డి , యాకసిరి వెంకటరమణమ్మ , యాకసిరి హరిబాబు, గుంజి మస్తాన్‌ పాల్గొన్నారు. 

వెంకటాచలం : ఒక్కసారి అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమనాయుడు విమర్శించారు. మండలంలోని తాటిపర్తిపాళెం గ్రామంలో సోమవారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యాన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర, ప్రెటోలు, డీజిల్‌, ధరలు, కరెంటు, ఆర్టీసీ చార్జీలు, అన్ని రకాల పన్నులకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. కార్యక్రమంలో చల్లా నాగార్జున్‌రెడ్డి, వలిపి మునుస్వామి, నిక్కుదల రమేష్‌, యనమల కిష్టయ్య, జంగం రమణయ్య, బద్వేలు చెన్నకృష్టయ్య, సురేష్‌, మునీంద్ర, పాళెపు మణి తదితరులున్నారు.

టీపీ గూడూరు  వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర విమర్శించారు. మండలంలోని నరుకూరు గ్రామంలో సోమవారం టీడీపీ ఆధ్వర్యాన బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక  తక్కువ ధరకు అమ్ముకొని నష్టాలపాలయ్యారన్నారు. రైతులకు అందుతున్న 9 గంటల సరఫరాను 7 గంటలకు కుదించిందని విమర్శించారు. కార్యక్రమంలో నరుకూరు ఎంపీటీసీ కొణతం రఘుబాబు, నాయకులు నెల్లపూడి సుధాకర్‌, మద్దెన గోపాల్‌నాయుడు, కోడూరు శ్రీనివాసులురెడ్డి, ముత్యాల శ్రీనివాసులు, ఆకుల జయకుమార్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-17T04:45:08+05:30 IST