ఢిల్లీ లింక్‌ కోసం జల్లెడ

ABN , First Publish Date - 2020-04-04T11:48:38+05:30 IST

పెనుగొండలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు అయిన సంఘటనతో వారితో కలసి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న పెనుమంట్ర మండలానికి చెందిన 20 మందికి ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ముందుస్తు చర్యల్లో భాగంగా క్వారెంటైన్‌ స్టాంపులను వేశారు.

ఢిల్లీ లింక్‌ కోసం జల్లెడ

పెనుమంట్ర మండలంలో 

20 మందికి క్వారంటైన్‌ ముద్రలు


పెనుమంట్ర, ఏప్రిల్‌ 3 : పెనుగొండలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు అయిన సంఘటనతో వారితో కలసి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న పెనుమంట్ర మండలానికి చెందిన 20 మందికి ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ముందుస్తు చర్యల్లో భాగంగా క్వారెంటైన్‌ స్టాంపులను వేశారు.  ఇంటిలోనే ఉండాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిని అతిక్రమించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీరిని తణుకు క్వారంటైన్‌ సెంటర్‌కు తరలిస్తామన్నారు. ఆలమూరు పీహెచ్‌సీ పరిధిలో నలుగురు, మార్టేరు నుంచి 16 మంది, నెగ్గిపూడి, కొయ్యేటిపాడు,వెలగలేరు గ్రామాలకు చెందిన వారిని గృహ నిర్బంధంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితులపై ఆరోగ్యశాఖ పర్యవేక్షించి వ్యాధి లక్షణాలు కనిపించినట్లేతే ఐసోలేషన్‌ వార్డుకు తరలించే అవ కాశం ఉంది.  ఐతే పెనుగొండలో పాజిటివ్‌ వచ్చిన ఒక వ్యక్తితో కలసి వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు ఎంతమంది ఉంటారనేదానిపై అధికారులు ఆరా తీయ్యగా సుమారు 400 మందికి పైగా ఉంటారని అంచనాకు వచ్చారు. వీరి ఆచూకీ  కోసం ప్రయత్నాలు చేసి వారికి స్టాంపులు వేసి గృహ నిర్బంధానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 


గుండంపల్లి నుంచి ఒకరి తరలింపు

ద్వారకా తిరుమల, ఏప్రిల్‌ 3 : మండలంలోని గుండంపల్లిలో కరోనా కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీ సదస్సుకు వెళ్లిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం గుండంపల్లిలో బంఽధువు ఇంటికి వచ్చినట్టు స్థాని కులు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆ వ్యక్తిని ఏలూరు క్వారం టైన్‌కు తరలించారు.


పెనుగొండ వివాహ వేడుకలకు 

401 మంది  హాజరు 

పెనుగొండ , ఏప్రిల్‌ 3: పెనుగొండలో జరిగిన వివాహ వేడుకల్లో కరోనా వైరస్‌ సోకిన ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారని ఆ వివాహ వేడుకలకు 401 మంది  హాజరయ్యారని ఎంపీడీవో పురుషోత్తమరావు తెలిపారు. వివాహ వేడుకలకు ఉభయ గోదావరి జిల్లా,  ఇతర  ప్రాంతాల నుంచి 401 మంది  హాజరయ్యారని విచరణలో  తేలిందన్నారు. హాజరైన వారికి పలు  సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. వ్యక్తులకు అనారోగ్య పరిస్థితులు తలెత్తితే  వైద్యసేవలందిస్తామన్నారు. 


 అత్తిలి నుంచి ఆరుగురు క్వారంటైన్‌కు

అత్తిలి, ఏప్రిల్‌ 3 : అత్తిలికి చెందిన ఒకే కుటుం బంలోని ఆరుగురిని తాడేపల్లిగూడెం క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఉండిలోని ఓ ప్రార్థన కేంద్రంలో మత గురువుగా చేస్తున్నాడు. అయితే ఇటీవల ఉండి ప్రాంతంలో కరోనా పాటిటివ్‌గా తేలిన వ్యక్తితో ఈ మతపెద్ద పలు కార్యక్రమాల్లో పాలొ ్గన్నాడు. ముందస్తు చర్యల్లో భాగంగా మత పెద్దతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి ఆరోగ్య సిబ్బంది క్వారంటైన్‌కు తరలించారు.

Updated Date - 2020-04-04T11:48:38+05:30 IST