పాపం వృద్ధులు

ABN , First Publish Date - 2021-03-04T06:38:23+05:30 IST

వృద్ధులపై వైసీపీ నేతలు ప్రతాపం చూపుతున్నారు. వలంటీర్ల సహకారంతో పింఛన్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారు.

పాపం వృద్ధులు
ఎంపీడీవో కార్యాలయం వద్ద పింఛన్‌ కార్డులతో బాధితులు

ఓటు వేయలేదని పింఛన్ల నిలిపివేత

బయోమెట్రిక్‌ తీసుకుని వలంటీర్లు వేధింపులు


నరసరావుపేట, శావల్యాపురం, మార్చి 3: వృద్ధులపై వైసీపీ నేతలు ప్రతాపం చూపుతున్నారు. వలంటీర్ల సహకారంతో పింఛన్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారు. పంచా యతీ ఎన్నికల్లో తాము సూచించి న వారికి ఓటు వేయలేదని వలంటీర్లు తమకు పింఛన్‌ ఇవ్వ డం లేదని వృద్ధులు వాపోతున్నా రు. వైసీపీ నేతలు వలంటీర్ల ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వృద్ధులు         ఆరోపిస్తున్నారు. వలంటీర్లను అడ్డం పెట్టుకుని పింఛన్లను నిలి పి వేశారన్నారు. నరసరావుపేట మండలంలోని పమిడిపాడులో ముగ్గురు వలంటీర్లు అధికార పార్టీ నేతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మార్చి 1న పిం ఛన్‌ పంపిణీ చేయాల్సి ఉండగా బుధవారం వరకు 30 మందికి ఇవ్వలేదు. వైసీపీ మద్దతుదా రులకు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయనందునే పింఛన్లు నిలిపివేశామని, ఇక నుంచి ఇవ్వ బోమని వృద్ధులను వలంటీర్లు బెదిరిస్తున్నారు. దీంతో  లబ్ధిదారు లు మంగళవారం సబ్‌ కలెక్టర్‌, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలి సిందే. అయినా వలంటీర్లు స్పం దించలేదు.  దీంతో బుధవారం ఎంపీడీవో బూచిరెడ్డి గ్రామ కార్యదర్శిని విచారణకు ఆదేశించా రు. బయోమెట్రిక్‌ తీసుకొని పిం ఛన్‌ ఇవ్వకుండా వృద్ధులను వలం టీర్లు వేధిస్తున్నట్లు ఆయన విచా రణలో తేలింది. బయో మెట్రిక్‌ తీసుకొని 30 మందికి పింఛన్‌ పంపిణీ చేయలేదని ఎంపీడీవో బూసిరెడ్డి సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌కు నివేదిక అందజేశారు. బయోమెట్రిక్‌ తీసుకున్న వారం దరికీ పింఛన్లు ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి ఆదేశించినా బుధవారం సాయంత్రం వరకు సదరు లబ్ధిదారులకు నగదు అందలేదు. 


పోట్లూరులో 11 మందికి..

తమకు పింఛన్‌ ఇవ్వలేదని శా వల్యాపురం మండలం పోట్లూరు గ్రామానికి చెందిన 11 మంది వృద్ధులు, మహిళలు బుధవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఎంపీడీవోకు  మొరపెట్టుకున్నా రు. పంచాయతీ ఎన్నికల్లో అధి కార పార్టీకి ఓటు వేయలేదన్న కా రణంతో జాబితాలో పేరు రాలేదని వలంటీర్లు పింఛన్‌ ఇవ్వలేదని వాపోయారు.  దీంతో స్పందించిన ఎంపీడీవో మాథ్యూబాబు పోట్లూ రు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను మండల పరిషత్‌ కార్యాలయానికి పిలిపించి 11 మందికి పింఛన్లు పంపిణీ చేయించారు.

Updated Date - 2021-03-04T06:38:23+05:30 IST