జాబితా.. జల్లెడ!

ABN , First Publish Date - 2021-07-21T05:32:59+05:30 IST

జిల్లాలో పింఛన్ల కోతలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సాం కేతిక కారణాలతో సుమారు పది వేల మందికి పింఛన్లు నిలిపి వేశారు.

జాబితా.. జల్లెడ!
పింఛను లబ్ధిదారులు

అనర్హులుగా తేలితే పింఛన్‌ కట్‌!

జిల్లాలో పింఛన్ల కోతకు రంగం సిద్ధం

లబ్ధిదారుల కుదింపునకు ప్రణాళిక

ఒంటరి మహిళ, వితంతు, వికలాంగుల పింఛన్లపై దర్యాప్తు

వివరాలు సేకరిస్తున్న వలంటీర్లు, సచివాలయ సిబ్బంది


(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పింఛన్ల కోతలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సాం కేతిక కారణాలతో సుమారు పది వేల మందికి  పింఛన్లు నిలిపి వేశారు. తాజాగా ఒంటరి మహిళ, వితంతు, దివ్యాంగుల, అనా రోగ్యంతో పింఛన్లు పొందుతున్న వారి వివరా లను సేకరిస్తున్నారు. వీరిలో అనర్హులను తొల గించే ప్రక్రియ చేపడుతున్నారు. జిల్లాలో 28,029మంది ఒంటరి మహిళలు పింఛను లబ్ధి దారులుగా ఉన్నారు. ఈ జాబితాను జల్లెడ పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమా చారం మేరకు 14,065 మంది ఒంటరి మహిళ ల పింఛన్లపై దర్యాప్తు చేస్తున్నారు. వీరికి చెం దిన రేషన్‌కార్డుల్లో వారి భర్త పేరు కూడా ఉన్న ట్లు తేలింది. ప్రతినెలా తెల్లకార్డుపై రేషన్‌ కూడా తెచ్చుకుంటున్నారు. భర్తతో విడాకులు తీసు కున్నవారు, 35ఏళ్లు దాటి వివాహం కాని వారి ప్రభుత్వం ఒంటరి మహిళల పేరుతో ఎం పిక చేసి పింఛను మంజూరు చేస్తోంది. తొలుత లబ్ధి దారుల ఎంపికలో చూసీచూడనట్లు వ్యవ హరించారు. రేషన్‌కార్డులో భర్తపేరు ఉండటం తో వారు కలిసి ఉన్నట్లుగా భావించి పెన్షన్‌ తొల గించటానికి అవసరమైన రికార్డును తయారుచేస్తున్నారు. 


వితంతు పెన్షన్‌లపై దృష్టి..

జిల్లాలో 2,07,179 మంది వితంతువులు ప్రతినెలా పెన్షన్‌ పొందుతున్నారు. కొందరి పిల్లలు ప్రయోజకులై స్థితిమంతులై ఉన్నారు. పిల్లలు ఆదాయపన్ను పరిధిలో వున్నా తల్లులు వితంతు పింఛను లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. ఇటువంటి వాటిని తొలగించటానికి అవసరమైన రికార్డులు తయారు చేస్తున్నారు. కొంతమంది  విదేశాల్లో ఉన్నంటున్న బిడ్డల వద్దకు విమానాల్లో వెళ్లి వస్తున్నారు. ఇటువంటి లబ్ధిదారులను తొలగించటానికి ప్రభుత్వం సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టింది. ఎయిర్‌లైన్స్‌ అధికారుల ద్వారా విమాన ప్రయాణికుల జాబితాలను సేకరిస్తున్నారు. పాస్‌పోర్టు, జీఎస్‌టీ పరిధిలో ఉన్న వారి జాబితాలను ఆయా కార్యాలయాల నుంచి సేకరించటం లేదా ఇంటర్‌నెల్‌లో పరిశీలించి ట్రాక్‌ చేస్తున్నారు. వీటితోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు, ఇంటిపన్ను రసీదులు, బ్యాంక్‌లో పంట రుణాలు, గోల్డ్‌లోన్లు, పోస్టల్‌, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలను పరిశీలిస్తున్నారు.  పెన్షన్‌ లబ్ధిదారుల ఆధార్‌ను పరిగణనలోకి తీసుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వివరాలను సేకరిస్తున్నారు. 


దివ్యాంగులు, అనారోగ్య పెన్షన్‌లు..

జిల్లాలో 55,111మంది దివ్యాంగులు, 4,194 మంది రోగులు పింఛన్లు పొందు తున్నారు. దివ్యాంగుల పింఛన్లను పరిశీలించటానికి జిల్లాస్థాయిలో సాం ఘిక సంక్షేమశాఖ జేడీని ప్రత్యేక అధికా రిగా నియమించారు. అదే తరహాలో రోగు ల పింఛన్లపై జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారికి బాధ్యతలు అప్పగించారు. వికలాంగుల పింఛన్లలో వైద్యుల సర్టిఫికెట్లను పరిశీలించటం, విక లాంగులలో కొంతమందికి ఇతర పింఛన్లు ఉంటే వాటిని తొలగించటం తదదితర అంశాలపై దృష్టి పెడుతున్నారు.  అన్ని ఆధారాలున్నట్లు తేలిన వెంటనే పింఛను నిలివేయటానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు ఇప్పటికే వివరాల సేకరణను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.  


 

Updated Date - 2021-07-21T05:32:59+05:30 IST