నకిలీ ఆధార్‌తో పింఛన్లు!

ABN , First Publish Date - 2020-09-24T09:03:34+05:30 IST

నకిలీ ఆధార్‌కార్డుల తో అర్హత లేకున్నా చాలామంది పింఛన్లు తీసుకుంటూ ప్రభుత్వ ధనాన్ని వృఽథా చేస్తున్నట్లు మండలంలోని గౌకనపల్లి గ్రామ సచివాలయ పరిధిలో వెలుగుచూస్తోంది.

నకిలీ ఆధార్‌తో పింఛన్లు!

అధికార పార్టీ నాయకుడి మాయాజాలం

ఒక్కొక్కరి నుంచి రూ.12 వేలు వసూలు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు


నంబులపూలకుంట, సెప్టెంబరు 23: నకిలీ ఆధార్‌కార్డుల తో అర్హత లేకున్నా చాలామంది పింఛన్లు తీసుకుంటూ ప్రభుత్వ ధనాన్ని వృఽథా చేస్తున్నట్లు మండలంలోని గౌకనపల్లి గ్రామ సచివాలయ పరిధిలో వెలుగుచూస్తోంది. వీటి వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గౌకనపల్లి సచివాలయ పరిధిలో చాలా వరకు నకిలీ సర్టిఫికెట్లతో పింఛన్‌ పొందుతున్నారని తెలుస్తోంది.


ఎన్పీకుంట మండలానికి దగ్గరగా ఉన్న కడప జిల్లాలోని ఓ ప్రాం తంలో నకిలీ ఆధార్‌కార్డులు తయారు విషయాన్ని తెలుసుకున్న ఓ అధికార పార్టీ నాయకుడు వారితో బేరం కుదుర్చుకుని నకిలీ ఆధార్‌కార్డులు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఒకొక్కరి నుంచి రూ. 12 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో అంగవైకల్యం లేకపోయినా ఉన్నట్లు సర్టిఫికేట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి.


ఇటీవల ఆ గ్రామానికి చెందిన అధికార, ప్రతిపక్ష నాయకులు సైతం నకిలీ ఆధార్‌ కార్డులపై తహసీల్దార్‌, ఎంపీడీఓల దృష్టికి తీసుకెళ్ళినా ఏమాత్రం విచారణ చేయక పోవడంపై కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించి, పింఛన్లు మంజూ రు చేయిస్తూ స్థానిక సం స్థల ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి.


ఈ విషయంపై ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ సదానందను వివరణ కోరగా నకిలీ ఆధార్‌కార్డుల విషయంపై ఆ గ్రామానికి చెందిన వారు కొందరు ఫిర్యాదు చేశారని, అయితే నకిలీ ఆధార్‌ కార్డుల వివరాలు ఆన్‌లైన్‌లో చూపించవన్నారు. ఉన్నతాధికారుల నుం చి ఆదేశాలు వస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.

Updated Date - 2020-09-24T09:03:34+05:30 IST