సీఎఫ్‌ఎంఎస్‌లో జనరేట్‌ అయిన పెన్షన్‌ స్లిప్పులు

ABN , First Publish Date - 2022-01-29T22:19:33+05:30 IST

ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల విషయంలో తన పంతాన్ని నెగ్గించుకునే

సీఎఫ్‌ఎంఎస్‌లో జనరేట్‌ అయిన పెన్షన్‌ స్లిప్పులు

అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల విషయంలో తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. కొత్త పీఆర్సీకి అనుగుణంగా సీఎఫ్‌ఎంఎస్‌లో పెన్షన్‌ స్లిప్పులు జనరేట్‌ అయ్యాయి. 2018కి ముందు రిటైర్‌ అయిన వారికి కొత్త పీఆర్సీలో పెన్షన్‌ ఫిక్స్‌ అయింది. 70 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ రద్దు అయింది. కొత్త పీఆర్సీ ప్రకారం 20.02 శాతం డిఏ మంజూరయింది. హెల్త్‌ అలవెన్స్‌ 97 రూపాయలు పెరిగింది. అడిషనల్‌ పెన్షన్‌లో వేల రూపాయలు కట్‌ చేసి అలవెన్స్‌లో 97 రూపాయలు ముష్టి వేశారంటున్నపెన్షన్‌‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెదవి విరుస్తున్నారు. 2018 తరువాత రిటైర్‌ అయిన వారికి ఐఆర్‌, డీఏ లేదు. హెల్త్‌ అలవెన్స్‌ 397 రూపాయలే పడింది. 

Updated Date - 2022-01-29T22:19:33+05:30 IST