పెన్షన్‌ సదుపాయం కల్పించాలి

ABN , First Publish Date - 2021-07-27T04:28:25+05:30 IST

చెప్పులు కుట్టే వృత్తి దారులకు, డప్పు కొట్టే దళిత కళాకారులకు, కాటి కాపరులకు పెన్షన్‌ సదుపాయం కల్పించాలని కోరు తూ సోమవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అం దించారు.

పెన్షన్‌ సదుపాయం కల్పించాలి
తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి

వనపర్తి రూరల్‌,జూలై 26: చెప్పులు కుట్టే వృత్తి దారులకు, డప్పు కొట్టే దళిత కళాకారులకు, కాటి కాపరులకు పెన్షన్‌ సదుపాయం కల్పించాలని కోరు తూ సోమవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అం దించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి మొదటి ముఖ్యమంత్రిగా దళి తులను చేస్తానని, లేదంటే తల నరుక్కుంటానని చెప్పి మాట తప్పి దళితజాతికి ద్రోహం చేశారన్నా రు. సంక్షేమం ముసుగులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వనరుల దోపిడికి పాల్పడుతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. కృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం,  జి ల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు, అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షుడు నరసింహ, సీనియర్‌ నాయకులు నారాయణ, నర సింహ, శివ, రణదీర్‌, ప్రభాకర్‌, నాగరాజు,  బుచ్చ న్న, శాంతన్న,కృష్ణయ్య, పెంటయ్య, సత్యం, మన్యం, యాపర్ల బాలయ్య, రమేష్‌, బాలస్వామి, చిన్న మన్యం పాల్గొన్నారు.

‘కేజీ టు పీజీ ఉచిత విద్య  ఏమాయె..?’

వనపర్తి అర్బన్‌, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేసి ఉంటే లావణ్య మృతి చెందేది కాదని, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీని కూడా సీఎం నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి మండి పడ్డారు. సోమవారం పట్టణంలోని గాంధీనగర్‌లో లావణ్య ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను  పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. అనంతరం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి లావణ్య కుటుంబ సభ్యుల కు రూ. 15వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్య క్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి బోస్‌పల్లి ప్రతాప్‌, జిల్లా అధ్యక్షుడు రాజవర్ధ్దన్‌రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి యమున పటాక్‌, బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

‘అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి’

పెబ్బేరు, జూలై 26 : కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న  కరోనా వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు వేయించుకోవాలని బీజేపీ నాయకురాలు బండారు శ్రుతి కోరారు. సోమవారం పెబ్బేరు ప్ర భుత్వ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిం చారు. అనంతరం బీజేపీ సీనియర్‌ నాయకులు గౌనివేమారెడ్డి స్వగృహాంలో విలేకరులతో మాట్లాడా రు. కార్యక్రమంలో సబ్బిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేమారెడ్డి, కౌన్సిలర్లు గోపిబాబు, రాఘవేంద్రగౌడ్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-07-27T04:28:25+05:30 IST