ఒకరి పేరు మీద Pension.. మరొకరికి డబ్బులు

ABN , First Publish Date - 2022-02-15T11:56:10+05:30 IST

ప్రభుత్వం ఓ వృద్ధురాలికి పింఛన్‌ మంజూరు చేసింది. కానీ బ్యాంకులో పడ్డ డబ్బులను..

ఒకరి పేరు మీద Pension.. మరొకరికి డబ్బులు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ప్రభుత్వం ఓ వృద్ధురాలికి పింఛన్‌ మంజూరు చేసింది. కానీ బ్యాంకులో పడ్డ డబ్బులను మరొకరు తీసుకోవడం అధికారులనే విస్మయానికి గురిచేసింది. ఫిలింనగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు నాలుగేళ్ల క్రితం పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ, ప్రతినెలా ఖాతాకు డబ్బు జమకావడం లేదని ఆమె సోమవారం జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెల్దండ వెంకటేష్‌కు తెలిపింది. వెంటనే ఆయన రెవెన్యూ అధికారులను వాకబు చేయగా జూబ్లీహిల్స్‌లోని ఎస్‌బీఐ లో వృద్ధురాలి పేరిట ఉన్న ఖాతాలో డబ్బు జమ అవుతున్నట్టు చెప్పారు. బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించగా పింఛన్‌ డబ్బు ఎవరో ప్రతినెలా ఏటీఎం నుంచి డ్రా చేస్తున్నారని సమాధానమిచ్చారు. ఏటీఎం కార్డు నిలుపుదల చేసి వచ్చే నెల నుంచి పింఛన్‌ను వృద్ధురాలికి అందించాలని మేనేజర్‌ను కార్పొరేటర్‌ కోరారు. పింఛన్‌ ఎవరు డ్రా చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - 2022-02-15T11:56:10+05:30 IST