ఆన్‌లైన్‌ ద్వారా నేడు పెన్షన్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-05-12T06:18:12+05:30 IST

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పెన్షనర్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా పెన్షన్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు భవిష్యనిధి అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్‌లైన్‌ ద్వారా నేడు పెన్షన్‌ అదాలత్‌

గుంటూరు(తూర్పు), మే 11: కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పెన్షనర్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా పెన్షన్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు భవిష్యనిధి అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షనర్లు తమ సమస్యలను కార్యాలయ వేళల్లో 0863-2344106, 0863-2232921 నెంబ ర్లకు ఫోన్‌ చేసి లేదా 94946-57649 అనే నెంబరుకు వాట్సాప్‌ చేయాలని తెలిపారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు జూమ్‌ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మీటింగ్‌లో పాల్గొనదలిచిన వారు 9502 155 6233  ఐడీని, ఈపీఎఫ్‌వో ఎట్‌ ది రేట్‌ 1234 పాస్‌ కోడ్‌ను ఉపయోగించి జాయిన్‌ అవ్వాలని కోరారు. మొయిల్‌ ద్వారా కూడా సమస్యలను తెలుపుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. 


Updated Date - 2021-05-12T06:18:12+05:30 IST