అమెరికాలో స్టీల్‌ ఉత్పత్తుల తయారీకి కంపెనీ: పెన్నార్‌

ABN , First Publish Date - 2020-08-13T06:04:31+05:30 IST

అమెరికాలో స్టీల్‌ ఉత్పత్తుల పంపిణీ, మెటల్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌, స్ట్రక్చర్ల తయారీకి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ నిర్ణయించింది...

అమెరికాలో స్టీల్‌ ఉత్పత్తుల తయారీకి కంపెనీ: పెన్నార్‌

  • త్రైమాసిక ఆదాయం రూ.166 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాలో స్టీల్‌ ఉత్పత్తుల పంపిణీ, మెటల్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌, స్ట్రక్చర్ల తయారీకి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ నిర్ణయించింది. పెన్నార్‌ గ్లోబల్‌ ఐఎన్‌సీ పేరుతో కంపెనీని ఏర్పాటు చేయడానికి పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉన్న 5 ఎకరాల భూమిని విక్రయించాలని, విక్రయ పత్రాలపై సంతకాలు చేసే అధికారాన్ని కంపెనీ వైస్‌ చైర్మన్‌, ఎండీ ఆదిత్యరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  కే లావణ్య కుమార్‌కు అప్పగించింది. 2020, జూన్‌తో ముగిసిన మూడు నెలలకు కంపెనీ రూ.34 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.16.5 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. నికర ఆదాయం కూడా రూ.537.8 కోట్ల నుంచి రూ.166.2 కోట్లకు తగ్గింది. 2020, ఆగస్టు ఒకటి నాటికి పెబ్స్‌ చేతిలో రూ.513 కోట్లు, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సొల్యూషన్స్‌ విభాగం వద్ద రూ.57 కోట్లు, రైల్వే విభాగం వద్ద రూ.192 కోట్ల ఆర్డర్లు ఉన్నట్లు కంపెనీ ఎండీ ఆదిత్య రావు తెలిపారు. 


Updated Date - 2020-08-13T06:04:31+05:30 IST