Abn logo
Sep 21 2021 @ 16:26PM

అవినీతి, అక్రమాలకు రాజానగరం కేర్ ఆఫ్ అడ్రస్: పెందుర్తి

తూ.గో.జిల్లా: రాజానగరం నియోజకవర్గం అవినీతి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై పరోక్ష ఆరోపణలు చేశారు. రెండున్నరేళ్లలో భూ కబ్జాలు, దళితులపై దాడులు, ఇసుక దోపిడీలకు అడ్డూ, అదుపు లేకుండ పోయిందన్నారు. కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైద్య సాయం చేస్తామంటూ రాజానగరం వైసీపీ నేతలు రూ. 15 కోట్లు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. తన ఆరోపణలపై సత్య ప్రమాణాలకు సిద్ధమా? అంటూ వైసీపీ నేతలకు పెందుర్తి వెంకటేష్ సవాల్ విసిరారు.  

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...