పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T06:31:44+05:30 IST

నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న పెండింగ్‌ పనులన్నీ త్వరగా పూర్తి చేసేలా ప్రధానోపా ధ్యాయులు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో ఎన్వీవీఎస్‌ మూర్తి కోరారు.

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

రాజానగరం, మే 23: నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న పెండింగ్‌  పనులన్నీ త్వరగా పూర్తి చేసేలా ప్రధానోపా ధ్యాయులు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో ఎన్వీవీఎస్‌ మూర్తి కోరారు. నాడు- నేడులో భాగంగా మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానానికి  అనుగుణంగా ఆయా పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పేరెంట్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏవిధమైన కాంట్రాక్టు విధానం లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఎంఈవో లజపతిరాయ్‌ మాట్లాడుతూ జీవీకే కిట్లు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి త్వరలో కాంప్లెక్స్‌లకు చేరతాయని వాటిని పాఠశాల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు అందజే యాలన్నారు. సమావేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:31:44+05:30 IST