పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2020-12-05T05:44:19+05:30 IST

కొవిడ్‌ సమయంలో ప్రాణాలను లెక్క చేయ కుండా రోగులకు సేవలు అందిస్తున్న తమకు వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రిమ్స్‌లోని కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు ఆరోపించారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రిమ్స్‌ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి
రిమ్స్‌ ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 4: కొవిడ్‌ సమయంలో ప్రాణాలను లెక్క చేయ కుండా రోగులకు సేవలు అందిస్తున్న తమకు వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రిమ్స్‌లోని కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు ఆరోపించారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రిమ్స్‌ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. రిమ్స్‌ అధికారులు, కాంట్రాక్ట్‌ సొసైటీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతనాలు చెల్లించేంత వరకు విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్‌ నర్సులు మాట్లాడుతూ ఆరు నెలల క్రితం శక్తి సొసైటీ ద్వారా తమను భర్తీ చేసుకున్నా రన్నారు. ప్రస్తుతం ఆ సొసైటీ మరో సొసైటీకి తన కాంట్రాక్టును అప్పగించడంతో వేతనాలు సక్రమంగా అందడం లేదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నామన్నారు. వేతనాలు లేక అద్దె కట్టలేని స్థితి నెలకొందన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వహించిన ఇప్పటికి అలవెన్సులు ఇవ్వలేదన్నారు. వేతనాల విషయమై ప్రతి అధికారిని కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వేతనాలు చెల్లించేంత వరకు విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు.


Updated Date - 2020-12-05T05:44:19+05:30 IST