Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెండింగ్‌ పనులు పూర్తిచేయాలి : కలెక్టర్‌

నాగారం / అర్వపల్లి, అక్టోబరు 22: నాగారం మండలంలోని ఫణిగిరి గ్రామంలో పెండింగ్‌ పనులు ఈ నెల చివరికల్లా పూర్తి చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఫణిగిరి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మిస్తున్న మెగా పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక పనులు పరిశీలించారు. అనంతరం హరితహారంలో నాటిన మొక్కలు పరిశీలించి వాటి సంరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. విధులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 
అదేవిధంగా అర్వపల్లి మండలంలోని అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం గుట్ట మధ్యలో మెగా పల్లె ప్రకృతి వనం కోసం స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. 365వ జాతీయ రహదారుల వెంట ఉన్న మొక్కలను సర్పంచ్‌లు విధిగా కాపాడుకోవాలన్నారు. ఇప్పటికే జాజిరెడ్డిగూడెం నుంచి బిక్కుమళ్ల వరకు, సూర్యాపేట నుంచి తిరుమలగిరి వరకు వేల సంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు.

Advertisement
Advertisement