పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-05-17T06:44:25+05:30 IST

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వేగవంతంగా పూర్తిచేయాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలి
దేవరకొండ సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతున్న పల్లా వెంకట్‌రెడ్డి

సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి


దేవరకొండ, డిండి, మే 16: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వేగవంతంగా పూర్తిచేయాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దేవరకొండ సీపీఐ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, డిండి మం డలం తవక్లాపూర్‌లో నిర్వహించిన మండల మహాసభలో ఆయన మాట్లాడా రు. ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫరీతంగా ధరలు పెంచుతూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని, అదే సమయంలో డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. డిండి, ఎస్‌ఎల్‌బీసీ, నక్కలగండి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి భూనిర్వాసితులకు పునరావాసం కల్పించి, పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. మతాన్ని ఎజెండాగా చేసుకున్న బీజేపీని కట్టడిచేసేందుకు ఉద్యమించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతలపై ప్రభుత్వం నిర్లక్ష్యంవహిస్తోందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి రమావత్‌ అంజయ్యనాయక్‌, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్‌రెడ్డి, కేశవరెడ్డి, ఉప్పునూతల వెంకటయ్య, పోలే వెంకటయ్య, జయరాములు, వెంకటేశ్వరరెడ్డి, బుచ్చ య్య, వెంకటరమణ, ఎండి.మోయినుద్దీన్‌, విజేందర్‌రెడ్డి, కేశవులు, గొరటి వెంకట య్య, ఎస్‌ఆర్‌.కనకచారి, నూనె  వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:44:25+05:30 IST