Abn logo
Sep 23 2021 @ 01:16AM

విద్యాశాఖలో పెండింగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న నిరుద్యోగులు

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నిరుద్యోగుల వినతి 

జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 22 : ఏడాది న్నరగా విద్యాశాఖలో భర్తీకాకుండా పెండింగ్‌ లో ఉన్న వివిధ క్యాడర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంఘ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షా అభియా న్‌ కింద ఐదు విభాగాలకు సంబంధించి, రాష్ట్ర వ్యాప్తంగా 704 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చి రెండేళ్లు గడుస్తోందన్నారు. పరీక్ష రాసి, మెరిట్‌ కార్డులు విడుదలై ఏడాది న్నర గడిచినా నేటికీ నియామక పత్రాలు అందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులను పలు మార్లు కలిసి నియామకాలు చేపట్టాలని కోరినా కొవిడ్‌ సాకుతో నియామ కాలను వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. ఈ నియామకాల గురించి ఏడాది న్నర కాలంగా సమగ్ర శిక్షా అభియాన్‌ నుంచి ఎలాంటి సమాచారం లేకపో వడంతో అభ్యర్థులంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం అయిన సందర్భంగా ఈ విష యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్రంలోని 704 పోస్టులైన డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ఐఈఏపీ, ఎంఐఎస్‌, సిస్టం అనలిస్ట్‌, అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌ తదితర పోస్టులను త్వరితగతిన భర్తీ చేసే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని వినతిపత్రంలో కోరారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా నిర్వహించిన ఐదు విభాగాల పోస్టులను భర్తీ చేస్తూ నియామకపత్రాలు అందించాలని జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు కట్టెకో ల నారాయణ, వన్నెల గంగారెడ్డి, ఆనంద్‌ రెడ్డి, విజయ్‌, రవీందర్‌, నరేష్‌ కుమార్‌, రాంప్రసాద్‌, శరత్‌ తదితరులున్నారు.