Abn logo
Sep 27 2020 @ 05:18AM

పెండింగ్‌ పాస్‌పుస్తకాలు ఇవ్వాలి

ఎర్రుపాలెం, సెప్టెంబరు 26: పెండింగ్‌లో ఉన్న పాస్‌పుస్తకాలను వెంటనే రైతులకు అందజేయాలని జడ్పీచైర్మన్‌ లింగాల కమలరాజు రెవెన్యూ అధికారులకు సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీపీ దేవరకొండ శిరీష అధ్యక్షతన జరిగిన మండలపరిషత్‌ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రప్రభుత్వం రైతుసంక్షేమానికి అనేక పథకాలను అందిస్తుందన్నారు. పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ తమ గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై అధికారులకు ఫోన్‌ చేసినా పట్టించుకోవడం లేదని జడ్పీచైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన జడ్పీచైర్మన్‌ గ్రామాల్లో విద్యుత్‌ సమస్య లేకుండా తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఎంపీడీవో అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్‌ జగదీశ్వర్‌ప్రసాద్‌, జడ్పీటీసీ శీలం కవిత, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement