పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-26T04:55:36+05:30 IST

పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌ కేసులు లేకుండా ఎప్పటి కప్పుడు పరిష్కరించుకోవాలని డీఎస్పీ మహేశ్‌ అన్నారు.

పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి
వివరాలు తెలుసుకుంటున్న డీఎస్పీ మహేశ్‌, పక్కనే సీఐ స్వామి

- వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ మహేశ్‌

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 25 : పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌ కేసులు లేకుండా ఎప్పటి కప్పుడు పరిష్కరించుకోవాలని డీఎస్పీ మహేశ్‌ అన్నారు. పెండింగ్‌ కేసులను దర్యాప్తు చేసి సరైన సాక్ష్యాలతో చార్జిషీట్‌ దాఖలు చేయాలని సూచించారు. ఆదివారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను విజిట్‌ చేసిన ఆయన అక్కడి పరిస్థితులు, క్రేం రికార్డ్‌లను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన శాంతిభద్రతల పర్యవేక్షణలో ఎప్ప టికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేషన్‌ పరిధిలో క్రైమ్‌ వివరాలు పరిశీ లించారు. పలు కేసులపై ఆరా తీశారు. ఎలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్రైమ్‌ రేట్‌ తగ్గించడంతోపాటు స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ స్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T04:55:36+05:30 IST