పెంచలకోన కొత్త కమిటీ కోసం కసరత్తు

ABN , First Publish Date - 2021-05-13T16:59:57+05:30 IST

సుమారు రెండేళ్ల తర్వాత..

పెంచలకోన కొత్త కమిటీ కోసం కసరత్తు

నెలాఖరున నోటిఫికేషన్‌ జారీ?

అప్పుడే క్యూ కడుతున్న ఆశావహులు  


రాపూరు: సుమారు రెండేళ్ల తర్వాత పెంచలకోన పెంచల నృసింహుడి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి పాలకులు కసరత్తు మొదలెట్టారు. ఈ నెల లోనే దేవదాయ ధర్మదాయ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మండలి చైర్మన్‌గా, ధర్మకర్తగా ఉండేందుకు ఆశావహుల సంఖ్య పెరగడంతో పోటీ తీవ్రమైంది. గతంలో ఉన్నవారితో పాటు కొత్తవారు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ తమకు అనుకూలంగా ఉన్న నేతల వద్దకు క్యూ కడుతున్నారు.


కోర్టును ఆశ్రయించిన పాత కమిటీ

అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వం నూత న కమిటీని నియమించింది. కొన్నిరోజులకే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చైర్మన్‌తోపాటు పలు వురు ధర్మకర్తలు రాజీ నామా చేశారు. కొంతమంది అలాగే కొనసాగారు. కొత్త ప్రభుత్వం ఆలయాల కమి టీలను రద్దు చేస్తూ తీర్మానం చేసింది. దీంతో కోన కమిటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. తమ పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉందని, అప్పటి వరకు తమను కొనసాగించాలని కోరారు. ఈ మేరకు న్యాయస్థానం కూడా వారికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారి పదవీకాలం ముగియడంతో కొత్త పాలక వర్గం ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. 


Updated Date - 2021-05-13T16:59:57+05:30 IST