ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌పై పెనాల్టీని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-05-20T05:28:42+05:30 IST

మోటారు వాహనాల ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌పై పెనాల్టీని వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌పై పెనాల్టీని రద్దు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కార్మిక సంఘాలు

సుభాష్‌నగర్‌, మే 19: మోటారు వాహనాల ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌పై పెనాల్టీని వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్‌లో భాగంగా జిల్లాలో వాహనాలను నిలిపివేసి నిరసన తెలిపి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ చేయిం చుకోకపోతే రోజుకు 50 రూపాయలు పెనాల్టీ విధించడం సరైందికాదన్నా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తు, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరా లుగా కరోనా కారణంగా అన్ని రకాల వాహనాల కార్మికులు నష్టాలని చవి చూసారని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పెనా ల్టీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్‌, ఏఐటీయూసీ జిల్లా అఽధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న, ప్రధాన కార్యదర్శి టేకుమళ్ల సమ్మయ్య, టీఆర్‌ఎస్‌కేవీ నాయకుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, ఐఎస్‌టీయూ నాయకుడు జిందం ప్రసాద్‌, పున్నం రవి, ము త్యాల కృష్ణయాదవ్‌, బండారి సంపత్‌, ప్రభాకర్‌, బి వీరయ్య, కే చంద్రయ్య, చెలికాని శ్రీనివాస్‌, కనుకయ్య, సురేష్‌, సంపత్‌, మురళి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:28:42+05:30 IST