Sep 23 2021 @ 01:15AM

‘పెళ్లి సందడి’ ట్రైలర్‌ విడుదల

‘‘వెండితెరకు రాఘవేంద్రరావుగారు నటుడిగా పరిచయం అవుతున్న ‘పెళ్లి సందడి’ ట్రైలర్‌ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు, చిత్రబృందానికి ఆల్‌ ద వెరీ బెస్ట్‌’’ అని మహేశ్‌బాబు తెలిపారు. రోషన్‌, శ్రీలీల జంటగా గౌరీ రోణంకి దర్శకత్వంలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన చిత్రం ‘పెళ్లి సందడి’. రాఘవేంద్రరావు అతిథి పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.