Oct 14 2021 @ 12:37PM

తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న 'పెళ్లి సందD' టీమ్

తిరుమల శ్రీనివాసుడిని 'పెళ్లి సందD' టీమ్ దర్శించుకున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రోషన్, శ్రీలీలా జంటగా రూపొందిన తాజా చిత్రం 'పెళ్లి సందD'. గౌరీ రోనక్ ఈ మూవీతో దర్శకురాలుగా పరిచయమవుతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 15న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకురాలు గౌరీ..హీరోహీరోయిన్‌లు రోషన్, శ్రీలీలా ఈరోజు స్వామి వారీ ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చి విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్రం విడుదల నేపథ్యంలో స్వామి వారీ ఆశీస్సులు పొందామని హీరో రోషన్, శ్రీలీలా తెలిపారు. అలాగే దర్శకురాలు గౌరీ.. ఇది పూర్తి కుటుంబ కధా చిత్రమని...ఓ పండగలా  వుంటుందని తెలిపారు.