Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 15 Oct 2021 18:02:08 IST

Movie review: ‘పెళ్లి సందD'

twitter-iconwatsapp-iconfb-icon

సినిమా టైటిల్‌: ‘పెళ్లి సందD'

విడుదల తేది: అక్టోబర్‌ 15, 2021

నటీనటులు: రోషన్‌, శ్రీలీలా, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, తనికెళ్ల భరణి,  రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, శ్రీనివాస్‌ రెడ్డి, అన్నపూర్ణ, ప్రగతి, హేమ తదితరులు. 

సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌ నామ

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

ఎడిటర్‌: తమ్మిరాజు

నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, మాధవి కోవెలమూడి

దర్శకత్వ పర్యవేక్షణ: కె.రాఘవేంద్రరావు 

దర్శకత్వం:  గౌరీ రోణంకి.


పాతికేళ్ల క్రితం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ ఎంత విజయం సాధించిందో తెలిసిందే! మళ్లీ పాతికేళ్ల తర్వాత అదే టైటిల్‌తో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా రావడం విశేషం. ఆ చిత్రంలో హీరోగా నటించిన శ్రీకాంత్‌ తనయుడు ఇప్పటి పెళ్లి సందడి చిత్రంలో హీరో కావడం మరో విశేషం. రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతోపాటు ఓ కీలక పాత్ర కూడా పోషించారు. ఇన్ని ప్రత్యేకతల మధ్య దసరా పండుగకు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు చేరుకుంది?పాతికేళ్ల కిందట తండ్రి శ్రీకాంత్‌ చేసిన సందడిని తనయుడు రోషన్‌ రిపీట్‌ చేశాడా అన్నది చూద్దాం. 


కథ: వశిష్ట (రోషన్‌) తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అతను ఒక బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌.  ఒక పెళ్ళిలో సహస్ర (శ్రీలీలా)ను చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా వశిష్టపై మనసు పడుతుంది. సరదాగా మొదలైన వీరిద్దరి ప్రేమ కథకు సహస్ర సోదరి (వితిక శేరు) తీసుకున్న నిర్ణయం  అడ్డుకట్టగా నిలుస్తుంది. దానితో వీరిద్దరి మధ్య బంధం ఏమైంది? ఈ ప్రేమికులు ఇద్దరు ఒకటయ్యారా? అన్నది మిగతా కథ. Movie review:  పెళ్లి సందD


విశ్లేషణ: మాయ (శివాని) అనే ఓ దర్శకురాలు ధ్యాన్‌ చంద్‌ అవార్డు గ్రహీత అయిన వశిష్టపై సినిమా తీయాలనుకుంటుంది. అతని స్టోరీ కోసం మాయ తండ్రి రాజేంద్రప్రసాద్‌ రంగంలోకి దిగుతాడు. అక్కడ మొదలవుతుంది ఈ సినిమా. పెళ్లి  నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ చిత్రానికి ‘పెళ్లి సందడి’ టైటిల్‌ పెట్టారనిపించింది.  కథ, కథనం పరంగా సినిమాలో ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. ఇదొక కుటుంబ కథా చిత్రమని మొదటి నుంచి చెబుతున్నారు. అయితే ఇందులో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే భావోద్వేగ సన్నివేశాలు ఎక్కడోగానీ కనిపించలేదు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రంలో ఆయన మార్క్‌ రొమాన్స్‌ కనిపించలేదు. దర్శకురాలి తడబాటు తెరపై కనిపించింది. పాటల చిత్రీకరణలో మాత్రం రాఘవేంద్ర రావు మార్క్‌ – కీరవాణి మార్క్‌ సంగీతం అలరించాయి. కామెడీ సన్నివేశాలు కొన్ని బలవంతంగా ఇరికించనట్లు అనిపించింది. కొన్ని సన్నివేశాల సాగదీత ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. అక్కడక్కడ సహజత్వం లోపించింది. హీరోహీరోయిన్ల జోడీ కొత్తగా, ప్రెష్‌గా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. తండ్రిలో ఉన్న ఛార్మింగ్‌ రోషన్‌లోనూ ఉంది. డాన్స్‌, డైలాగ్‌ డెలివరీ ఆకట్టుకుంది. తెర వెనక ఉండి కథ నడిపించే దర్శకేంద్రుడు తొలిసారి తెరపై కనిపించారు. ఆయన పాత్రను కాస్త రాసి ఉంటే బావుంటుంది. తెరపై కనిపించిన సీనియరర్‌ ఆర్టిస్ట్‌లంతా తమ పరిధి మేరకు చేసుకుంటువెళ్లారు. ఎడిటర్‌ అక్కడక్కడా ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. నిర్మాతలు ఖర్చుకి వెనకాడలేదు. 


Tagline: నో.. సందD


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International