భారత్‌లో పెగాసస్ కలకలం.. వాట్సాప్ చీఫ్ స్పందన ఇదీ..

ABN , First Publish Date - 2021-07-20T03:11:09+05:30 IST

పెగాసస్ వ్యవహారంపై వాట్సాప్ చీఫ్ విల్ క్యాథ్‌కార్ట్ తాజాగా స్పందించారు.

భారత్‌లో పెగాసస్ కలకలం.. వాట్సాప్ చీఫ్ స్పందన ఇదీ..

న్యూఢిల్లీ: భారత్‌లో పెగాసస్ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. పెగాసస్ ఉదంతంపై పార్లమెంట్ వేదికగా అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య తీవ్రవాదోపవాదాలు జరిగాయి. కాగా.. దీనిపై వాట్సాప్ చీఫ్ విల్ క్యాథ్‌కార్ట్ తాజాగా స్పందించారు. ఇజ్రాయలీ సంస్థ ఎన్‌ఎస్ఓ రూపొందించిన ఈ నిఘా సాఫ్ట్‌వేర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించి దారుణ ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాలని తేల్చిచెప్పారు. ‘‘వివిధ సంస్థలు, ముఖ్యంగా ప్రభుత్వాలు ఈ విషయంలో ఎన్‌ఎస్ఓ తీరును ఎండగట్టాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-07-20T03:11:09+05:30 IST