AP News: ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనితో..: మాజీమంత్రి పీతల సుజాత

ABN , First Publish Date - 2022-08-04T21:35:47+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనితో మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని పీతల సుజాత అన్నారు.

AP News: ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనితో..: మాజీమంత్రి పీతల సుజాత

అమరావతి (Amaravathi): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) చేసిన పనితో.. మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని టీడీపీ నేత, మాజీమంత్రి పీతల సుజాత (Peetala Sujata) అన్నారు. ఎంపీ గోరంట్ల ఓ మహిళతో మాట్లాడిన న్యూడ్ వీడియో (Nude Video) కాల్‌పై స్పందించిన ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వీడియో కాల్‌కు.. జిమ్‌లో వీడియోకు తేడా తెలియదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌పై సీఎం జగన్ ఆనాడు చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ విధంగా చేసేవారా? అని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీడీపీ మహిళా సత్తా ఏంటో చూపిస్తామని పీతల సుజాత అన్నారు.

Updated Date - 2022-08-04T21:35:47+05:30 IST