రుయ్యాడిలో ఘనంగా పీరీల పండుగ

ABN , First Publish Date - 2022-08-09T05:04:27+05:30 IST

కుల, మతాలకు అతీతంగా జరుపుకునే మొహర్రం ఉత్సవాలు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ ఉత్సవాల్లో భాగంగా మలిదల పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుయ్యాడి పీరీలను మాజీ ఎంపీ గోడం నగేష్‌, జిల్లా సహాకార సంఘం

రుయ్యాడిలో ఘనంగా పీరీల పండుగ
రుయ్యాడి హస్సేన్‌ హుస్సేన్‌ ఆలయంలో ప్రతిష్ఠించిన పీరీలు

భక్తులతో కిటకిటలాడిన హస్సేన్‌ హుస్సేన్‌ ఆలయాలు 

తలమడుగు, ఆగస్టు 8: కుల, మతాలకు అతీతంగా జరుపుకునే మొహర్రం ఉత్సవాలు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ ఉత్సవాల్లో భాగంగా మలిదల పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుయ్యాడి పీరీలను మాజీ ఎంపీ గోడం నగేష్‌, జిల్లా సహాకార సంఘం డైరెక్టర్‌ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, మాజీ విజయ డైరీ చైర్మన్‌ లోకభూమారెడ్డి, జడ్పీటీసీ గోకగణేష్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ జీవన్‌రెడ్డి, సర్పంచ్‌ పోతారెడ్డి, సీఈఓ మోతేశ్రీనవాస్‌తో పాటు వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా హస్సేన్‌ హుస్సేన్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడు లోక భూమారెడ్డి ఏర్పాట్లను చేపట్టామన్నారు. నమ్ముకున్న వారికి నమ్ముకునంతగా మేలు జరుగుతుందన్నారు. మహారాష్ట్ర చంద్రాపూర్‌ నుంచి వచ్చిన భక్తులు తనకు సంతానం కలుగాలని గత సంవత్సరం మొక్కుకోగా తనకు సంతానం కలిగిందని మహారాష్ట్ర నుంచి వచ్చి కుటుంబ సభ్యులతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మలిదల పండుగను పురస్కరంచుకుని ఉదయం నుంచి భక్తులు మలిద ముద్దలు, కిచిడి లడ్డులు, ఇతర ప్రసాదాలను తయారు చేసి హస్సేన్‌ హుస్సేన్‌కు సమర్పించుకున్నారు. కొంత మంది భక్తులు తమ కోరికలు తీరడంతో బెల్లంతో తులాభారం నిర్వహించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అదే విధంగా మండలంలోని తలమడుగు, సుంకిడి, బరంపూర్‌, కజ్జర్ల, సుంకిడి, పున్నగూడ తదితర గ్రామాల్లో మొహరం ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు.

Updated Date - 2022-08-09T05:04:27+05:30 IST