Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 10 Apr 2022 03:00:29 IST

పీకేని పీకే దమ్ముందా?

twitter-iconwatsapp-iconfb-icon
పీకేని పీకే దమ్ముందా?

  • జగన్‌కు పయ్యావుల సవాల్‌
  • అసమర్థతను, బలహీనతలను
  • కప్పిపెట్టుకోవడానికే తిట్ల దండకం
  • దిగజారిన ప్రతిష్ఠను కాపాడు
  • కునేందుకే పీకుడు భాష: కేశవ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌రెడ్డీ... తీవ్రత పెంచాల్సింది పాలనలో, భాషలో కాదు. పీకుడు భాష మాట్లాడ్డం మాకు ఇష్టం ఉండదు. మీ భాషలో అడగాలంటే... పీకుడు భాష మాట్లాడుతున్న మీకు పీకేను పీకే దమ్ముందా? పీకేని పీకేసి పాలన చేయగలవా? అసలు మూడేళ్లు ఏం పీకావ్‌? ఢిల్లీకి వెళ్లింది పీకడానికా... పీకించుకోవడానికా? పోలవరం ప్రాజెక్టుపై, అమరావతిలో అవినీతిపై, ప్రత్యేకహోదాపై, కోడికత్తి కేసుపై, మీ బాబాయ్‌ హత్యకేసుపై, సీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ఏం పీకావ్‌?’’ అంటూ పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ నిలదీశారు. ప్రజావేదికను, అన్న క్యాంటీన్‌లను, కరెంటును, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలను, డప్పు కళాకారులకు, బెస్తవారికి ఇచ్చే పింఛన్లను పీకేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో పయ్యావుల మాట్లాడారు. లేని గొప్పతనాన్ని చెప్పుకొనేందుకు, దిగజారిన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు జగన్‌ పీకుడు భాష మాట్లాడారంటూ మండిపడ్డారు.


‘‘సీఎం స్థాయికి తగని భాషను జగన్‌ ఎంచుకున్నారు. పీకే నివేదికలు, నిఘా నివేదికలు జగన్‌ వైఫల్యాన్ని బయటపెట్టాయి. వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పీకుడు భాష ప్రారంభించారు. 11న జరిగే మంత్రివర్గ కూర్పులో సీమ నుంచి ఎంతమంది మంత్రులను పీకుతారో చూస్తాం. సొంత కేబినెట్‌లో పీకలేని జగన్‌, ప్రతిపక్షాలనేం పీకుతారు? వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్న పీకే నివేదిక నేపథ్యంలో తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి జగన్‌ భాషలో తీవ్రత పెంచారు. తిట్ల దండకం తో దాడిచేస్తే శంకరగిరి మాన్యాలు తప్పవు. భాష మార్చుకోకపోతే ప్రజలు పీకేయడం ఖాయం’’ అని పయ్యావుల హెచ్చరించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.