పెడిక్యూర్‌తో మహిళ కాళ్లకు ఇన్ఫెక్షన్.. కాలు తీసేసిన డాక్టర్లు.. తనకు జరిగిన నష్టానికి ఆమె ఏం చేసిందంటే?..

ABN , First Publish Date - 2021-12-31T09:55:21+05:30 IST

కాళ్లను అందంగా ఉంచుకోవడాని పెడిక్యూర్ చేయించుకున్నా ఓ మహిళ తన కాలునే కోల్పోవాల్సి వచ్చింది. పెడిక్యూర్ వికటించి కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స కోసం డాక్టర్లు ఆమె కాలుని తీసేశారు...

పెడిక్యూర్‌తో మహిళ కాళ్లకు ఇన్ఫెక్షన్.. కాలు తీసేసిన డాక్టర్లు.. తనకు జరిగిన నష్టానికి ఆమె ఏం చేసిందంటే?..

కాళ్లను అందంగా ఉంచుకోవడాని పెడిక్యూర్ చేయించుకున్నా ఓ మహిళ తన కాలునే కోల్పోవాల్సి వచ్చింది. పెడిక్యూర్ వికటించి కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స కోసం డాక్టర్లు ఆమె కాలుని తీసేశారు. దీంతో ఆ బాధితురాలు పెడిక్యూర్ చేసిన బ్యూటీపార్లర్ పై కేసు వేసి భారీ నష్టపరిహారం పొందింది. 


వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన క్లారా షెల్ మాన్ అనే మహిళ 2018లో టంపాలోని టామీస్ నెయిల్స్ అనే పార్లర్‌లో తన పాదాలకు పెడిక్యూర్‌ చేయించుకుంది. పాదాలకు పగుళ్లు ఉన్నాయని.. పెడిక్యూర్ చేయించుకుంటే పాదాలు అందంగా కనిపిస్తాయని పార్లర్ సిబ్బంది సూచించడంతో క్లారా అందుకు ఒప్పుకుంది. పాదాలు మంచి అందంగా ఉండటానికి పెడిక్యూర్ లో భాగంగా పార్లర్ ఉద్యోగి కాస్మటిక్‌​ ట్రీట్‌మెంట్‌ చేసింది. 


ఈ ట్రీట్ మెంట్ సమయంలో పొరపాటున క్లారా కాలు కాస్త తెగింది. అప్పుడు అది చిన్న గాటే అయినా అదే క్లారా జీవితంలో మర్చిపోలేని విషాద ఘటనగా మారింది. ఆ గాయం ఆమె జీవితాన్నే విషాదంగా మార్చేసింది. క్లారాకు ఫెరిఫెరల్‌ వాస్క్యూలర్‌ అనే వ్యాధి (రక్తనాళాల్లో కొలస్ట్రాల్‌ ఏర్పడి ద్వారాలు ఇరుకై బ్లడ్ సర్క్యులేషన్ కు ప్రాబ్లమ్ గా ఏర్పడుతుంది) ఉండటంతో ఆ గాయం మానలేదు. దీంతో ఆ చిన్న గాయం కాస్తా పెద్ద ఇన్ఫెక్షన్‌గా మారింది. దాంతో ఆమె కాలు తీసే పరిస్థితి ఏర్పడింది. వైద్య ఖర్చుల కోసం క్లారా ఏకంగా ఇంటినే అమ్ముకోవాల్సి వచ్చింది. 


క్లారా తన పాదాల సౌందర్యం కోసం చేయించుకున్న పెడిక్యూర్‌ ఆమె జీవితాన్ని దయనీయ స్థితిలోకి నెట్టేసింది. దీంతో క్లారా కోర్టులో కేసు వేసింది. తనకు గాయం కావటానికి కారణమైన సదరు బ్యూటీ పార్లర్ తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో టామీస్ నెయిల్స్ పార్లర్‌ క్లారాతో కోర్టు బయట సెటిల్ మెంట్ కుదుర్చుకుంది. తమది తప్పేనని ఒప్పుకొని నష్టపరిహారం ఇస్తామని తెలిపింది. క్లారాకు టామీస్ నెయిల్స్ పార్లర్‌ 1.75 మిలియన్ డాలర్లు (రూ.13 కోట్లు) నష్టపరిహారం చెల్లించింది.

Updated Date - 2021-12-31T09:55:21+05:30 IST