Abn logo
Sep 25 2021 @ 00:42AM

పీఠమెక్కిన మండలాధ్యక్షులు

యాడికి ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న ఉమాదేవి


సజావుగా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కోఆప్షన ఎన్నిక

కొలువుదీరిన నూతన సభ్యులకు సత్కారం


జిల్లాలో శుక్రవారం మండల పరిషత అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన సభ్యుల ఎన్నిక సజావుగా సాగింది. ఆ యా మండల పరిషత కార్యాలయాల సమావేశ భవనాల్లో ప్రత్యేక ఎన్నికల అధికారుల సమక్షంలో ఎంపీటీసీలు కోఆప్షన సభ్యులను, అనంతరం నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ప్రమాణస్వీకారం చేయించి పదవీ బాధ్యతలు అప్పజెప్పారు. కాగా యల్లనూరులో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నిక సా గింది. బ్రహ్మసముద్రంలో ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ కనుసన్న ల్లో చేపట్టిన ఎన్నికలో అధికారపార్టీకి చెందిన సభ్యుల నుం చే అసంతృప్తి వ్యక్తమైంది. మండల పరిషత కార్యాలయాని కి తలుపులు వేసి లోగుట్టుగా తతంగాన్ని నడిపారు. గుమ్మఘట్ట ఎంపీపీ ఎన్నికలో అధికార వైసీపీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. నూతన సభ్యుల సన్మానం సందర్భంగా నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 


ప్రజాసేవే పరమార్థంగా పనిచేయాలి

ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి

గుంతకల్లు, సెప్టెంబరు 23: నూతనంగా ఎంపికైన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీ ప్రజా సేవే పరమార్థంగా ఐదేళ్లూ పనిచేసి పార్టీకి మంచి పేరు తేవాల ని ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండల పరిషత పా లకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ముందు గా వివిధ పదవులకు నామినేషన్లు స్వీకరించారు. అనంత రం ఎంపీటీసీలచే ప్రమాణ స్వీకారం చేయించి, ఎంపీపీగా ప్రతిపాదించిన నెలగొండ ఎంపీటీసీ సభ్యురాలు మాధవిచే ప్రమాణం చేయించారు. ఆ తర్వాత జీ కొట్టాలకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ప్రభావతిని వైస్‌ ఎంపీపీగా, కో-ఆప్షన సభ్యుడిగా వైటీ చెరువుకు చెందిన సిపాయి బాషాచే ప్ర మాణస్వీకారం చేయుంచారు. ఈ మేరకు వారికి నియామక పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మండల పరిషత కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన పార్టీ సభలో ఎ మ్మెల్యే వై వెంకటరామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య హాజరై మాట్లాడారు. సీఎం జగన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పె ద్దపీట వేశారన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం జగనకే దక్కిందన్నారు. మొట్ట మొదటిసారిగా గుంతకల్లు మండలం ఎంపీపీ స్థానాన్ని వై సీపీ కైవసం చేసుకుందన్నారు. అధికారులు, వైసీపీ కార్యకర్తలు నూతన ప్రజా ప్రతినిధులకు పూలమాలలు వేసిశుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి గోవిందరాజులు, ఎంపీడీఓ సూర్యనారాయ ణ, తహసీల్దార్‌ రాము, జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన కదిరప్ప, మార్కెట్‌ యార్డు చైర్మన ఎన భీమలింగప్ప, కసాపు రం దేవస్థాన ట్రస్టీ త్యాగరాజు, వైసీపీ నాయకులు చింబిలి భాస్కర్‌, మోహన, గోవిందనాయక్‌ పాల్గొన్నారు.


కూడేరు ఎంపీపీగా నారాయణ రెడ్డి

వైఎస్‌ ఎంపీపీగా దేవాంజనేయులు

కూడేరు : మండల ఎంపీపీగా నారాయణరెడ్డి, వైస్‌ ఎం పీపీగా దేవాంజనేయులును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీ పీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన్ల ఎన్నిక జరిగింది. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. పీ నా రాయణపురం ఎంపీటీసీగా గెలుపొందిన నారాయణరెడ్డిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. కమ్మూరు ఎంపీటీసీగా గెలుపొందిన దేవాంజనేయులును వైస్‌ ఎంపీపీగా ఎన్నుకోగా... కూ డేరుకు చెందిన సర్దార్‌వలి కో-ఆప్షన మెంబర్‌గా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీదేవి, ఎంపీడీఓ లక్ష్మినారాయణ, తహశీల్దార్‌ శ్రీనివాసులు ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి గజమాలలతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ఆర్‌బీకే చైర్మన మేరీ నిర్మలమ్మ, జడ్పీటీసీ తుప్పటి అశ్విని, వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బైరెడ్డి రామచంద్రారెడ్డి, వడ్డే గంగాధర్‌, జల్లిపల్లి దేవేంద్ర, తుప్పటి హరీష్‌, కురుబ రా మచంద్ర, చోళసముద్రం గంగాధర్‌, ఆనంద్‌ రెడ్డి, వెంకటరామిరెడ్డి, ధనుంజయ యాదవ్‌, తిరుపతయ్య, తోపుదుర్తి రా మాంజనేయులు, రామదుర్గం కిష్టప్ప, శంకర్‌నాయక్‌, కు మ్మరి శ్రీనివాసులు, బండారు శ్రీనివాసులు, శివరావు, అరవకూరు రాజన్న, సుబ్బారెడ్డి, పరిశీలకులు రమణ, వైఎస్సార్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓబుళపతి, సర్పంచలు మందా రా మాంజనేయులు, చంద్రశేఖర్‌ యాదవ్‌, చిన్నరంగారెడ్డి, ఎ బ్బిలి ధనుంజయ, ఓబులేసు, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.


కొర్రకోడును అభివృద్థి పథంలో నడిపిస్తా

ఎంపీటీసీ చిట్రా శివలాల్‌ రెడ్డి 

కూడేరు మండలం కొర్రకోడు గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపీటీసీ చిట్రా శివలాల్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కూడేరులో ఆయన ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకు లు వడ్డే గంగాధర్‌, సర్పంచ చంద్రశేఖర్‌ యాదవ్‌, ధనుంజ య యాదవ్‌, వెంకటరామిరెడ్డి, ఈడిగ ప్రభాకర్‌, బెస్త చౌడ ప్ప, కోతి ఎర్రప్ప, గొల్ల రాజప్ప తదితరులు మాట్లాడారు. కొ ర్రకోడు పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో తమ సత్తా చాటామని, అదే తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తామని వారు తె లిపారు.


యాడికి ఎంపీపీగా ఉమాదేవి

యాడికి : యాడికి మండల పరిషత అధ్యక్షురాలిగా ఉ మాదేవి ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నాగరాజు తెలిపా రు. ఉపాధ్యక్షురాలిగా హసీనాబేగం ఎన్నికయ్యారు. శుక్రవా రం యాడికిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశభవనం లో ఎంపీపీగా ఉమాదేవి అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు నాపై నమ్మకం ఉంచి పదవి అందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదా లు తెలియజేశారు. నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానన్నారు. కోఆప్షన మెంబర్‌గా షెక్షావలిని ఎన్నుకున్నారు. ఎంపీపీగా ఎన్నికైన ఉమాదేవిని ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధనరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ బొంబాయి రమే్‌షనాయుడు, మాజీ జడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, యాడికి సర్పంచు అనురాధ, ఉప సర్పంచు కాసా చంద్రమోహన తదితరులు అభినందించారు. కార్యక్రమం లో కొత్తగా ఎంపికైన ఎంపీటీసీలు వెంకటనాయుడు, నాగరాజు, రాంమోహన, వెంకటరాముడు, చెన్నప్ప, నాగరాణి, పార్వతి, రామాంజనమ్మ, విజయగౌరమ్మ, నాగరత్న, లక్ష్మిదేవి, జయప్రద, గోవిందమ్మ పాల్గొన్నారు. 


వైసీపీ నాయకులపై కేసు నమోదు

యాడికి: కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా జన సమూహంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన వైసీపీ మండల క న్వీనర్‌ బొంబాయి రమే్‌షనాయుడు వర్గీయులపై కేసు నమోదుచేశామని ఎస్‌ఐ రాంభూపాల్‌ శుక్రవారం తెలిపారు. యాడికిలో ఎంపీపీ ప్రమాణస్వీకారం అనంతరం నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం, డ్రమ్స్‌, డీజె పెట్టడం వంటివి చేశారన్నారు. పో లీస్‌ 30 యాక్ట్‌ అమలులో ఉండడంతో బొంబాయి రమే్‌షనాయుడు వర్గీయులు 30 మందిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.


విడపనకల్లు ఎంపీపీగా నాగలక్ష్మి

విడపనకల్లు : మండలంలోని ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కోఆప్షన సభ్యుడి ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. పొలికి గ్రామంలో మా త్రం టీడీపీ మహిళా అభ్యర్థి గెలుపొందారు. ముందుగా వి డపనకల్లు గ్రామానికి చెందిన లతీ్‌ఫను మండల కో-ఆప్షన సభ్యునిగా పోటీలేకుండా ఎన్నుకున్నారు. అనంతరం ఎంపీ పీ ఎన్నిక నిర్వహించారు. వైసీపీకి కావాల్సిన మెజార్టీ ఉం డటంతో వేల్పుమడుగు గ్రామానికి చెందిన ఎంపీటీసీ బో య నాగలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అ నంతరం వైస్‌ ఎంపీపీగా పెద్ద కొట్టాలపల్లికి చెందిన మో దుపల్లి సునీతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా కొ లుదీరిన మండల ప్రజాప్రతినిధులను పలువురు ఘనంగా సన్మానించారు.  


టీడీపీ మహిళా ఎంపీటీసీకి అగౌరవం?

మండలంలో 15 ఎంపీటీసీ స్థానాల్లో 11 మంది మహిళ లే ఎంపీటీసీలుగా గెలుపొందారు నలుగురు మాత్రమే పు రుషులు గెలుపొందారు. అయితే 11 మంది మహిళల్లో ఒకే ఒక్కరు టీడీపీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు బోయపాటి తిమ్మక్క కాగా, మిగిన 10 మంది మహిళలు వైసీపీ వారే కావటం విశేషం. ఎన్నిక సందర్భంగా టీడీపీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలిని వైసీపీ మహిళలతో పాటుగా కాకుండా చి వరన కూర్చోబెట్టడం విమర్శలపాలైంది. మహిళను అగౌర వపరిచారంటూ పలువురు చర్చించుకున్నారు.


ఉరవకొండ ఎంపీపీగా చందా చంద్రమ్మ

ఉరవకొండ : మండల ప్రజాపరిషత అధ్యక్షురాలిగా ఉ రవకొండ-1వ ఎంపీటీసీ సభ్యురాలు చందా చంద్రమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మండల ప్ర జాపరిషత కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన సభ్యుల ఎన్నికను శుక్రవారం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు కో-ఆప్షన సభ్యుడుగా పీ మ హమ్మద్‌ సలీం నామినేషనను ఎన్నికల ప్రీసైడింగ్‌ అధికారి రాగప్పకు అందజేశారు. కో-ఆప్షనగా ఒక్కటే నామినేషన దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మధ్యాహ్నం ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణం చేయించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ ఎన్నికను చేపట్టారు. వై సీపీ ఆదేశాల మేరకు ఎంపీపీగా చంద్రమ్మను, వైస్‌ ఎంపీపీగా శ్రీనాథ్‌రెడ్డిని ఎన్నిక చేస్తూ ఫార్మ్‌-ఏ, బీ పత్రాలను ఆ పార్టీ తరపున అందజేశారు. పోటీ లేకపోవడంతో ఇరువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎంపీపీ, వైస్‌ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే పెద్ద కౌకుంట్ల ఎంపీటీసీ సభ్యుడిగా శ్రీనివాసులు, కౌకుంట్ల-2 ఎంపీటీసీ సభ్యుడిగా దేవరాజు ప్రమాణస్వీకారం చేశారు. 


కాగా కౌకుంట్ల పంచాయతీ పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందిన శ్రీనివాసులు, దేవరాజు టీడీపీ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులును మర్యాద పూర్వకంగా క లిశారు. అనంతపురంలోని ఆయన స్వగృహంలో కలిశారు. గెలుపొందిన టీడీపీ ఎంపీటీసీలను ఆయన అభినందించారు. ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ ఎర్రిస్వామి, టీడీపీ నాయకులు మారెన్న, ఎల్లప్ప పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం ఎంపీపీగా మారుతమ్మ

కళ్యాణదుర్గం : మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 11 వైసీపీ కైవసం చేసుకుంది. శుక్రవారం మండల పరిషత కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఎంపీడీఓ కొండన్న ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఎస్సీ వర్గానికి చెందిన మారుతమ్మ, ఉపాధ్యక్షురాలిగా అనురాధలను బలపరిచారు. కోఆప్షన సభ్యునిగా అబ్దుల్‌ రహిమాన ఎన్నిక య్యారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బోయ బొమ్మయ్య, వైసీ పీ నాయకులు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 


బెళుగుప్ప ఎంపీపీగా చిలబండ్ల పెద్దన్న

 బెళుగుప్ప : మండల అధ్యక్ష పదవి ఎన్నిక శుక్రవారం ఏకగ్రీవంగా జరిగింది. 12 ఎంపీటీసీ స్థానాలుండగా అన్ని వైసీపీ కైవసం కావడంతో ఎన్నిక ఏకపక్షమైంది. పార్టీ సీనియర్‌ నాయకుడు రామాంజనేయులు విప్‌ జారీచేశారు. ఎంపీపీగా దుద్దేకుంట ఎంపీటీసీ చిలబండ్ల పెద్దన్నను, వై స్‌ ఎంపీపీగా తగ్గుపర్తి ఎంపీటీసీ పుష్పవతి, కోఆప్షన స భ్యుడిగా గంగవరం చిన్న మస్తానయ్యలను ఏకగ్రీవంగా ఎ న్నుకున్నట్లు ఎన్నికల అధికారి హరికృష్ణ తెలిపారు. ఎంపీడీఓ ముస్తాప కమలబాషా, తహసీల్దార్‌ సుమతి, సీనియ ర్‌ అసిస్టెంట్‌ యోగానంద పాల్గొన్నారు. నూతన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను వైసీపీ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు నాగిరెడ్డి, శ్రీనివాసులు, రామేశ్వరరె డ్డి, భాస్కర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, కరుణాకర్‌, సర్పంచులు స లిబాయి, రమేష్‌, ఉమాపతి, శివలింగప్ప పాల్గొన్నారు.


తాడిపత్రి ఎంపీపీగా సరస్వతి

తాడిపత్రి టౌన : మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కోఆప్షన సభ్యుల ఎన్నిక స్పెషల్‌ ఆఫీసర్‌ తిప్పేస్వామి సమక్షంలో ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి ఎంపీపీగా సరస్వతి, వైస్‌ ఎంపీపీగా శ్రీదేవి, కోఆప్షన మెంబర్‌గా హాజిపీరాలు ఎన్నికయ్యారు. ఎన్నికైన వీరితో పాటు ఎంపీటీసీలచేత ప్ర మాణస్వీకారం చేయించారు. సమావేశంలో ఎంపీడీఓ రం గారావు, తహసీల్దార్‌ నాగభూషణం, ఈఓఆర్‌డీ జిలానబాషా, సభ్యులు పాల్గొన్నారు.


పెద్దపప్పూరు ఎంపీపీగా రామ్మూర్తిరెడ్డి

పెద్దపప్పూరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్పెష ల్‌ ఆఫీసర్‌ నాగమణి సమక్షంలో జరిగిన ఎన్నికలో ఎంపీపీ గా రామ్మూర్తిరెడ్డి, వైస్‌ ఎంపీపీగా కళావతి, కో ఆప్షనమెంబర్‌గా హాజివలి ఎన్నికయ్యారు. అధికారులు వీరిచేత ప్ర మాణస్వీకారం చేయించారు. సమావేశంలో ఎంపీడీఓ ప్ర భాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ షర్మిల, ఎంఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


కుందుర్పి ఎంపీపీగా కమలమ్మ   

కుందుర్పి: స్థానిక మండలపరిషత కార్యాలయంలో ఎం పీడీఓ నారాయణస్వామి ఆధ్యక్షతన శుక్రవారం నిర్వహించి న సమావేశంలో ఎంపీటీసీ కమలమ్మను మండల అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా వైస్‌ ఎం పీపీగా సోమప్ప, కోఆప్షన సభ్యుడిగా ముజివుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి చేత మండల ప్రత్యేక అధికారి నరసింహమూర్తి, డిప్యూటీ తహసీల్దార్‌ జమానుల్లాఖాన  ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వారికి డిక్లరేషన ఫారాలను అందజేశారు.


పుట్లూరు ఎంపీపీగా రాఘవరెడ్డి

పుట్లూరు: మండల ఎంపీపీగా ఎస్‌ వెంగన్నపల్లి ఎంపీటీసీ భూమిరెడ్డి రాఘవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల స్పెషల్‌ ఆఫీసర్‌ రమణారెడ్డి ఆ యనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్నికైన రాఘవరెడ్డిని ఎమ్మెల్యే పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి అభినందించారు. మొత్తం 11 మంది ఎంపీటీసీలు ఉండగా అంద రూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్‌ ఎంపీపీగా లక్ష్మిదేవిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శనగలగూడూరు ఎంపీటీసీ నాగార్జునరెడ్డి, సర్పంచులు రామకృష్ణారెడ్డి, రామాంజులరె డ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


పామిడి ఎంపీపీగా బోగాతి మురళీమోహనరెడ్డి

పామిడి: స్థానిక మండల ప్రజాపరిషత కార్యాలయంలో స్పెషలాఫీసర్‌ రజిత సమక్షంలో మండల పరిషత అధ్యక్షు లు, ఉపాధ్యక్షుల ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా జరిగింది.  ముందుగా మండల కో-ఆప్షన సభ్యుడుగా షేక్‌ రఫిద్‌ను ఏ కగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపీటీసీ సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎంపీపీగా బోగాతి మురళీమోహనరెడ్డిని, వైస్‌ ఎంపీపీగా నక్కా సౌభాగ్యను వైసీపీ ఎంపీటీసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్‌ ఐ చాంద్‌బాషా బందోబస్తు చేపట్టారు. ఎంపిక అనంతరం ఎంపీటీసీలు, కో-ఆప్షన సభ్యుడిని అఽధికారులు సన్మానించా రు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్‌ రజిత, ఎంపీడీఓ షకీలాబేగం, తహసీల్దార్‌ ఆర్‌వీ సునీతాబాయి, ఈఓఆర్‌డీ శశికళ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


వజ్రకరూరు ఎంపీపీగా దేవిబాయి

వజ్రకరూరు: మండలంలోని స్త్రీశక్తి భవనలో నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక శుక్రవారం సజావుగా సాగింది. ఎంపీపీగా రమావత దేవిబాయి, వైఎస్‌ ఎంపీపీగా గుండ్లపల్లి సుశీల రాణి, కో-ఆప్షన సభ్యుడిగా నబీరసూల్‌ను ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్లు ఎంపీడీఓ రెహనాబేగం పేర్కొన్నారు. ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి కట్టుదిట్టమైన బందోబస్తు ఏ ర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసులు, సూపరింటెండెంట్‌ జాషువా, వైద్యాధికారిణి జ్యోతిర్మయి, వై సీపీ మండల కన్వీనర్‌ జయేంద్రరెడ్డి పాల్గొన్నారు.


బొమ్మనహాళ్‌ ఎంపీపీగా పద్మ 

బొమ్మనహాళ్‌ : మండలంలో నూతనంగా గెలుపొందిన ఎంపీటీసీలు శుక్రవారం ఎంపీపీ, వైస్‌ఎంపీపీలను ప్రశాంతంగా ఎన్నుకున్నారు. ఎన్నికల నోడల్‌ అధికారి శివయ్య, రి టర్నింగ్‌ అధికారి సుబ్బారాయుడు, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఎంపీడీవో వెంకట చలపతి ఎంపీటీసీల ప్రమాణస్వీకారం, ఎన్నిక చేపట్టారు. ముందుగా కోఆప్షన మెంబర్‌గా హొన్నూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మాబూసాబ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మధ్యాహ్నం ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. 16 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. అనంతరం ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఎంపీపీని ఎన్నుకునే సమయానికి ఉప్పరహాళ్‌ ఎంపీటీసీ నాగమణి, గోవిందవాడ-1 ఎంపీటీసీ మఠం ప్రమీళ గైర్హాజరయ్యారు. 14 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రం హాజరయ్యారు. ఎంపీపీగా శ్రీధరఘట్ట ఎంపీటీసీ యూ పద్మను గోవిందవాడ-2 ఎంపీటీసీ కే రమేష్‌ ప్రతిపాదించారు. ఉద్దేహాళ్‌ ఎంపీటీసీ కల్పన బలపరిచారు. మిగ తా సభ్యులు 12 మంది పద్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎ న్నుకున్నారు. వైస్‌ ఎంపీపీగా గోవిందవాడ-2 ఎంపీటీసీ ర మే్‌షను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా ఉప్పరహాళ్‌ ఎం పీటీసీ ముల్లంగి నాగమణి ఎంపీపీ పదవి కోసం ప్రయత్నించగా, అధిష్టానం అవకాశం ఇవ్వకపోవడంతో మండల అధ్యక్ష ఎన్నిక సమయంలో గైర్హాజరైనట్లు తెలియవచ్చింది. ఎస్‌ఐ రమణారెడ్డి బందోబస్తు నిర్వహించారు. 


రాయదుర్గం ఎంపీపీగా విద్యావతి 

రాయదుర్గం రూరల్‌: రాయదుర్గం మండల పరిషత అధ్యక్షురాలిగా విద్యావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండల పరిషత కార్యాలయంలో ఎంపీడీవో కొండ య్య  సమక్షంలో ఎన్నిక జరిగింది. మండలంలో 12 మంది వైసీపీ ఎంపీటీసీలు గెలుపొందడంతో అధ్యక్ష, ఉపాధ్యక్షుల నియామకం సజావుగా సాగింది. ఎంపీపీగా విద్యావతి, వైస్‌ ఎంపీపీగా సత్యనారాయణ నాయుడు, కోఆప్షన మెం బర్‌ దిలావర్‌ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లికార్జున, ఎంపీటీసీలు రాజు, శ్యామ ల, రాజమ్మ, మదీన, శాంతాబాయి పాల్గొన్నారు. 


పెద్దవడుగూరు ఎంపీపీగా లక్ష్మిదేవి

పెద్దవడుగూరు: మండల ఎంపీపీగా లక్ష్మిదేవి, వైస్‌ ఎంపీపీగా హరినాథ్‌రెడ్డి ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నారాయణ తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శు క్రవారం జరిగిన సమావేశంలో ఎంపీపీ, ఉప ఎంపీపీల ఎ న్నిక జరిగింది. ఎంపీపీగా లక్ష్మిదేవిని ఎంపీటీసీ సభ్యురాలు కామాక్షి ప్రతిపాదించగా, మరొక సభ్యుడు లక్ష్మిరంగారెడ్డి బలపరిచారు. 


డీ హీరేహాళ్‌ ఎంపీపీగా పవిత్ర

డీ హీరేహాళ్‌: మండలంలో శుక్రవారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికలో మల్పనగుడి ఎంపీటీసీ సభ్యురాలు మ ల్లాపురం పవిత్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిషత కార్యాలయంలో ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, ఎంపీడీవో భాస్కర్‌ బాబు, తహసీల్దార్‌ బాలకిషన 12 మంది ఎంపీటీసీల చేత ముందుగా ప్రమాణస్వీకారం చేయించా రు. అనంతరం ఎంపీపీగా మల్లాపురం పవిత్రను, గొడిశెలపల్లి ఎంపీటీసీ సభ్యురాలు మూలింటి అనితను వైస్‌ ఎంపీపీగా, కోఆప్షన సభ్యులుగా మండల కేంద్రానికి చెందిన  ఇ షాక్‌ను ఎన్నుకున్నారు. నూతన ఎంపీపీ, వైస్‌ఎంపీపీలను మండలానికి చెందిన వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు.  


కణేకల్లు ఎంపీపీగా సంధ్య 

కణేకల్లు: కణేకల్లు ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, కోఆప్షన స భ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మండల ప రిషత కార్యాలయంలో జరిగిన ఎన్నికలో మండలంలోని గె ణిగెర గ్రామానికి చెందిన హెచ సంధ్య ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైసీపీకి చెందిన 18 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే కణేకల్లు 5వ బ్లాక్‌ ఎంపీటీసీ ఉప్ప ర నీలావతిని వైస్‌ ఎంపీపీగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్నికల ప్రత్యేకాధికారి యల్లమ్మ, తహసీల్దార్‌ ఉషారాణి, ఎంపీడీవో విజయభాస్కర్‌ సమక్షంలో ఎన్నిక చే పట్టారు. కోఆప్షన సభ్యుడిగా కణేకల్లుకు చెందిన చేపల స ర్మ్‌సను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ ఎస్‌ నరేంద్ర ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరయ్యారు. 


గుత్తి ఎంపీపీగా విశాలాక్షి

గుత్తి రూరల్‌: గుత్తి మండల ఎంపీపీగా విశాలాక్షిని ఏ కగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత కార్యాలయంలో ఎంపీటీసీల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి రాజ్‌కుమార్‌ 9 మంది వైసీపీ ఎంపీటీసీలు, ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా ఎ ర్రగుడికి చెందిన విశాలాక్షిని, వైస్‌ ఎంపీపీగా కొత్తపేటకు చెందిన తిరుపాలమ్మను, మండల కో-ఆప్షన సభ్యుడిగా కరిడికొండకు చెందిన ఖాశీంవలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైసీపీ నాయకులు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, వైసీపీ గుత్తి ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి, గుంతకల్లు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన నైరుతిరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు రాధిక, గుత్తి మున్సిపల్‌ చైర్‌పర్సన వన్నూరుబీ, వైసీపీ నాయకులు గోవర్ధనరెడ్డి, హుసేనపీరా, గురుప్రసాద్‌ యాదవ్‌, రమేష్‌ నాయుడు, ప్రవీన కు మార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.