అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి

ABN , First Publish Date - 2021-10-27T05:38:30+05:30 IST

ఏలేశ్వరం, అక్టోబరు 26: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరువ చేసే బాధ్యత సచివాలయాల సిబ్బందిదేనని పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తహశీల్దార్‌ ఎం.రజనీకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ కొండలరావు, హౌసింగ్‌ ఏఈ సువర్ణరాజు, ఆర్‌ఐ పొన్నాలతో కలసి ఏలేశ్వరంలోని వార్డు సచివాలయాలను తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, పథకాలు, సిబ్బంది

అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి
ఏలేశ్వరంలో సచివాలయ సిబ్బందికి సూచనలిస్తున్న ఆర్డీవో

పెద్దాపురం ఆర్డీవో వెంకటరమణ

ఏలేశ్వరం, అక్టోబరు 26: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరువ చేసే బాధ్యత సచివాలయాల సిబ్బందిదేనని పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తహశీల్దార్‌ ఎం.రజనీకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ కొండలరావు, హౌసింగ్‌ ఏఈ సువర్ణరాజు, ఆర్‌ఐ పొన్నాలతో కలసి ఏలేశ్వరంలోని వార్డు సచివాలయాలను తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, పథకాలు, సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరు, పనితీరుపై ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌, తహశీల్దార్‌ కార్యాలయాల్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం సర్వేపై సమీక్ష చేపట్టారు. 1980 నుంచి 2011 వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇల్లు, ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు పట్టణంలో 3455మంది, రూరల్‌ మండల పరిధిలో 7230మందిని ప్రాథమికంగా గుర్తించామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేతీరును ఆర్డీవో పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అలమండ సత్యవతి, కౌన్సిలర్‌ చలమయ్య, అవసరాల కిషోర్‌, సూర్యనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


నిబంధనల ప్రకారమే బాణసంచా విక్రయాలు  

పెద్దాపురం, అక్టోబరు 26: కొవిడ్‌ నిబంధనలు, ప్రభుత్వ మార్గర్శకాలను కచ్చితంగా పాటించి బాణసంచా విక్రయాలు సాగించుకోవాలని ఆర్డీవో పి.వెంకటరమణ తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మందుగుండు సామగ్రి విక్రయించేవారు తప్పనిసరిగా కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశానుసారం విక్రయాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో హెచ్చరించారు. డివిజన్‌లో ప్రతీ మండలంలో సంయుక్త బృందం పర్యవేక్షణలో బాణసంచా విక్రయాలు చేపడతామన్నారు. బృందంలో తహశీల్దార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, ఫైర్‌ ఆఫీసర్‌ ఉంటారన్నారు. వీరి ప్రతిపాదన మేరకే సదరు ప్రదేశంలో బాణసంచా వ్యాపారాలు సాగించేందుకు రెండురోజుల ముందు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. తాత్కాలిక బాణసంచా దుకాణాల్లో పెంకు చిచ్చుబుడ్లు నిషేధం అన్నారు. నిర్దేశిత పరిమాణం కంటే అధికంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంటే చర్యలు తప్పవన్నారు. షాపుల వద్ద పొగతాగడం నిషేధం, బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. 

Updated Date - 2021-10-27T05:38:30+05:30 IST