ప్రజల్లోకి వెళ్లలేం!

ABN , First Publish Date - 2021-07-29T05:03:38+05:30 IST

పెద్దాపురం, జూలై 28: పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని, లేకపోతే ప్రజల్లోకి వెళ్లలేమని పలువురు కౌన్సిలర్లు వారి వార్డుల్లో సమస్యలపై ఏకరువు పెట్టారు. మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశం చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీమంగతాయారు అధ్యక్షతన బుధవారం జ

ప్రజల్లోకి వెళ్లలేం!
సమస్యలు వివరిస్తున్న కౌన్సిలర్లు

పట్టణ సమస్యలపై దృష్టి సారించండి

పెద్దాపురం కౌన్సిల్‌ సమావేశంలో కౌన్సిలర్లు 

పెద్దాపురం, జూలై 28: పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని, లేకపోతే ప్రజల్లోకి వెళ్లలేమని పలువురు కౌన్సిలర్లు వారి వార్డుల్లో సమస్యలపై ఏకరువు పెట్టారు. మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశం చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీమంగతాయారు అధ్యక్షతన బుధవారం జరిగింది. కౌన్సిలర్‌ విజ్జపు రాజశేఖర్‌ మాట్లాడుతూ కొన్నేళ్లుగా మున్సిపల్‌ కార్యాలయంలో రోడ్‌ స్వీపింగ్‌ మిషన్‌ నిరుపయోగంగా ఉంటోందని, లక్షలు పోసి కొనుగోలు చేసిన యంత్రాన్ని వినియోగంలోకి తేవాలని సూచించారు. కౌన్సిలర్‌ త్సలికి తస్యభాస్కరరావు మాట్లాడుతూ పట్టణంలో వీధిలైట్లు సరిగా వెలగడం లేదని, ఎప్పుడు చూసినా సర్కూట్స్‌ పాడైపోయాయని చెప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌ అరెళ్ల వీర్రాఘవరావు మాట్లాడుతూ తమ వార్డులో విద్యుత్‌ స్థంభాల సమస్య, పారిశుధ్య సమస్యలు ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా స్పందించకపోవడమేంటని అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ తమ వార్డుల్లో అపరిష్కృతంగా కొన్ని సమస్యలు ఉంటున్నాయని, చెత్తపన్ను కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాని వాపోయారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, కమిషనర్‌ సురేంద్ర, మేనేజర్‌ నాగేశ్వరరావు, టీపీవో ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ దావీదురాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-29T05:03:38+05:30 IST