చేనేత సంఘాలు బలోపేతం కావాలి

ABN , First Publish Date - 2021-10-18T04:48:19+05:30 IST

పెద్దాపురం, అక్టోబరు 17: చేనేత సహకార సంఘాలు బలోపేతం కావాలని ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక చేనేత సంక్షేమ సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేతలను ఆదుకునేందుకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. చేనేత కార్మికులకు మరిన్ని రుణా

చేనేత సంఘాలు బలోపేతం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం, అక్టోబరు 17: చేనేత సహకార సంఘాలు బలోపేతం కావాలని ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక చేనేత సంక్షేమ సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేతలను ఆదుకునేందుకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. చేనేత కార్మికులకు మరిన్ని రుణాలు మంజూరు చేయాల రాజప్ప కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సూరిబాబురాజు, కౌన్సిలర్‌ యర్రా శ్రీను, ఆదినారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:48:19+05:30 IST