Abn logo
Jun 30 2020 @ 15:34PM

రామగుండంలో భగ్గుమన్న రాజకీయ కక్షలు

పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. కార్పొరేషన్ ఎన్నికలలో తమకు మద్దతు ఇవ్వలేదని ఎమ్మెల్యే అనుచరుడు బూరుగు వంశీకృష్ణపై దాడికి పాల్పడ్డారు. మాజీ కార్పోరేటర్ మేర్గు నరేశ్, మరో నలుగురు అతని అనుచరులు ఉన్నారు. ఈ దాడిలో వంశీ కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దాడి జరిగిన ప్రదేశంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement