నాకు ఇది పునర్జన్మనే: మైనింగ్ సర్దార్ నరేష్

ABN , First Publish Date - 2022-03-08T16:10:21+05:30 IST

గని ప్రమాదం నుండి ప్రాణాలతో వస్తా అని అనుకోలేదనిమైనింగ్ సర్దార్ నరేష్ అన్నారు.

నాకు ఇది పునర్జన్మనే: మైనింగ్ సర్దార్ నరేష్

పెద్దపల్లి: గని ప్రమాదం నుండి ప్రాణాలతో వస్తా అని అనుకోలేదనిమైనింగ్ సర్దార్ నరేష్ అన్నారు. సింగరేణి రామగుండం ఆర్జీ 3 ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన నరేష్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ....‘‘నాకు ఇది పునర్జన్మ. 86 లెవల్ వద్ద ఎస్‌డిఎల్ ఆపరేటర్ వెంకటేశ్వర్లు, నేను ఉన్నాం. అకస్మాత్తుగా పై కప్పు కూలింది. గజగజ వణికి పోయాం. వెంకటేశ్వర్లు మిషన్‌పై కూర్చున్నాడు. నేను బండి కిందికి వెళ్లి దాక్కున్నా. నాకు ఇది నిజంగా పునర్జన్మనే..’’ అనే నరేష్ అన్నారు. నిన్న రామగుండం ఆర్జీ-3లో పైకప్పు కూలిని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-03-08T16:10:21+05:30 IST