మీ సేవ ఉద్యోగి హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-11-29T20:24:34+05:30 IST

మీ సేవ ఉద్యోగి శంకర్ హత్యకేసులో రాజు అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మీ సేవ ఉద్యోగి హత్య కేసులో నిందితుడి అరెస్టు

పెద్దపల్లి జిల్లా: మీ సేవ ఉద్యోగి శంకర్ హత్యకేసులో రాజు అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మీ సేవ ఉద్యోగి శంకర్‌ను రాజు అనే వ్యక్తి కోపంతో తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేశాడని తెలిపారు. కేసు నుంచి తప్పించుకోడానికి మృతదేహాన్ని ఏడు భాగాలుగా కోసి వేర్వేరు చోట్ల పడేశాడన్నారు. కాగా రాజుకు శంకర్ భార్యతో వివాహేతర సంబంధం ఉందని, రాజు.. హేమలతతో కలిసి ఉన్న ఫోటోను శంకర్ వాట్సాప్‌కు పంపడం వల్లే ఈ గొడవ జరిగిందన్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ జరుపుతున్నామని సీపీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2021-11-29T20:24:34+05:30 IST