ఓటీటీలో వచ్చేసిన 'పెద్దన్న'..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'అణ్ణాత్త'. తెలుగులో 'పెద్దన్న'గా ప్రేక్షకులముందుకు వచ్చి ఆకట్టుకుంది. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా కీర్తి సురేశ్ రజనీకాంత్ చెల్లిగా నటించారు. సీనియర్ హీరోయిన్స్ కుష్బూ, మీనా కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాలు మధ్య విడుదల అయిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందని చెప్పుకున్నారు. వరుసగా ఫ్లాప్స్ వస్తున్న రజనీకి 'అణ్ణాత్త' మంచి కమర్షియల్ హిట్ ఇస్తుందని అనుకుంటే ఈసారి కూడా నిరాశే మిగిలిందనే టాక్ కూడా వినిపించింది. అయితే, ఈ సినిమా తమిళంలో మాత్రం రజనీ మేనియా వల్ల మంచి వసూల్లే రాబట్టింది. కాగా, సడన్ సర్‌ప్రైజ్‌లాగా అణ్ణాత్త ( పెద్దన్న ) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నిన్న రాత్రి నుంచే ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లోనూ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో మిస్సయిన ప్రేక్షకులు ఇప్పుడు చూసేయొచ్చు. 

Advertisement
Advertisement