ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఎలా ఇస్తాం

ABN , First Publish Date - 2021-04-16T05:09:06+05:30 IST

ప్రభుత్వాలను నమ్మి జీవనాధారమైన సాగు భూములను ఎలా ఇస్తామంటూ మండల పరిధిలోని పెదమద్దూరు రైతులు రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఎలా ఇస్తాం
వైకుంఠపురం గ్రామసభలో పాల్గొన్న అధికారులు, రైతులు

రాజధాని రైతులనే అన్యాయం చేసిన పాలకులు

వైఎస్‌ఆర్‌ పల్నాడు ప్రాజెక్టు భూసేకరణ సభలో రైతులు

అమరావతి, ఏప్రిల్‌ 15: ప్రభుత్వాలను నమ్మి జీవనాధారమైన సాగు భూములను ఎలా ఇస్తామంటూ మండల పరిధిలోని పెదమద్దూరు రైతులు రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న వైఎస్‌ఆర్‌ పల్నాడు డ్రాట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు సంబంధించి గురువారం పెదమద్దూరు, వైకుంఠపురం గ్రామాలలో గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా పెదమద్దూరు రైతులు మాట్లాడుతూ రాజధాని రైతులు గత ప్రభుత్వాన్ని నమ్మి అమరావతికి భూములను ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం వచ్చి వారిని రోడ్డు పాలు చేసిందన్నారు.    వైకుంఠపురం రైతులు కూడా భూములు ఇవ్వడం కుదరని తేల్చారు. గ్రామంలో ప్రాజెక్టు కింద సేకరించాల్సిన సుమారు 100 ఎకరాలు ఇనాం భూములపై కోర్టును ఆశ్రయించడం జరుగుతుందని గ్రామసభలో రెవెన్యూ అధికారులకు తెలిపారు.   కార్యక్రమంలో తహసీల్దారు భవానీశంకర్‌, ఆర్‌ఐ రామకోటేశ్వరరావు, సర్పంచ్‌ జాస్టి శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T05:09:06+05:30 IST